ETV Bharat / business

భారత ఎన్​జీఓకు పిచాయ్ రూ.5 కోట్ల విరాళం - గూగుల్ సీఈఓ

కరోనాపై పోరాటానికి సుందర్ పిచాయ్ రూ.5 కోట్లు విరాళం ప్రకటించారు. భారత్​లోని 'గివ్ ఇండియా' ఎన్​జీఓకు ఈ విరాళం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పిచాయ్​కు ధన్యవాదాలు చెబుతూ గివ్ ఇండియా ట్వీట్ చేసింది.

sundar pichai give india
సుందర్ పిచాయ్ గివ్ ఇండియా
author img

By

Published : Apr 13, 2020, 12:51 PM IST

కరోనాపై పోరాటంలో భాగంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ రూ.5 కోట్ల విరాళాన్ని ప్రకటించారు. భారత్​కు చెందిన స్వచ్ఛంద సంస్థ 'గివ్ ఇండియా'కు ఈ మొత్తం ఇచ్చినట్లు తెలుస్తోంది. గూగుల్ సంస్థ సైతం గివ్​ ఇండియాకు ఇదివరకే విరాళాన్ని అందించింది.

sundar pichai give india
గివ్ ఇండియా ట్వీట్

"రోజువారీ వేతన కార్మికుల కుటుంబాలకు అవసరమైన నగదు సహాయం అందించడానికి గూగుల్​ ఇచ్చిన విరాళానికి సమానంగా రూ.5 కోట్ల గ్రాంటు ప్రకటించిన సుందర్ పిచాయ్​కు ధన్యవాదాలు."-గివ్ ఇండియా ట్వీట్

ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలు బలిగొంటున్న కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు గూగుల్ ఇదివరకే 800 మిలియన్ డాలర్లను ప్రకటించింది. ఇందులో 200 మిలియన్ డాలర్లను ఎన్​జీఓలు, చిన్న వ్యాపారాలకు మూలధన సహాయం చేయడానికి కేటాయించింది. కరోనా కట్టడికి యాపిల్ సంస్థతోనూ కలిసి పనిచేస్తోంది గూగుల్. ఇందులో భాగంగా ఐఓస్, ఆండ్రాయిడ్​ ఫోన్ల మధ్య పరస్పరం కొవిడ్​ సమాచార మార్పిడికి ఓ వేదికను రూపొందిస్తోంది.

ఇతర సంస్థలూ

గూగుల్​తో పాటు భారతీయ సంస్థలు భారీగా విరాళాలు ప్రకటించాయి. అత్యధికంగా రూ.1500 కోట్ల విరాళాన్ని టాటా ట్రస్ట్ ఇవ్వగా.. విప్రో, అజిమ్ ప్రేమ్​జీ ఫౌండేషన్​ సంయుక్తంగా రూ.1,125 కోట్లను ప్రకటించాయి.

పేటీఎం సంస్థ 4 లక్షల మాస్కులు, 10 లక్షల హైజీన్ ఉత్పత్తుల(సబ్బులు, శానిటైజర్లు, హాండ్ వాషర్లు)ను సైన్యం, సీఆర్​పీఎఫ్, వైద్య ఉద్యోగులకు అందించనున్నట్లు తెలిపింది.

ఇదీ చదవండి: వాట్సాప్​లో ఈ కొత్త ఫీచర్ల గురించి తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.