బ్యాగులు తనిఖీలు చేసిన సమయాన్ని పనివేళల్లో కలపాలని యాపిల్ సంస్థకు కాలిఫోర్నియా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముగింపు వేళల్లో బ్యాగులను తనిఖీ చేయటానికి సుమారు 20 నుంచి 45 నిమిషాలు అదనంగా సమయం పడుతోందని.. ఇందుకు వేతనం చెల్లించాలని పేర్కొంది.
ఈ తీర్పు ప్రకారం.. ఇకపై కాలిఫోర్నియాలోని రిటైల్ దుకాణాల్లో పని చేస్తున్న 12వేల మందికి పైగా ఉద్యోగులకు మిలియన్ డాలర్లు అదనంగా యాపిల్ చెల్లించాల్సి ఉంటుంది.
యాపిల్‌తో విభేదించిన కోర్టు..
పని ప్రదేశాలకు ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకురాకపోతే.. ఈ సమస్య ఉండదని యాపిల్ చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది. అది సాధ్యం కాదని.. రోజువారీ జీవితంలో మొబైల్ భాగమైందన్న సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించింది.
గతంలో యాపిల్‌కు మద్దతుగా కింది స్థాయి కోర్టు తీర్పు వెలువరించింది. తనిఖీల సమయాన్ని పనిగంటలుగా పరిగణించరాదని తెలిపింది. ఈ తీర్పును సవాలు చేస్తూ కాలిఫోర్నియా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఉద్యోగులు.