ETV Bharat / business

కొవిడ్‌ బీమా పాలసీలు ఇంకా ఎన్నాళ్లకో.. - కొవిడ్​ -19 బీమా పాలసీలు

దేశంలో కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పుడు తక్కువ ప్రీమియానికే కరోనా పాలసీలు.. అంటూ వరుసకట్టాయి బీమా సంస్థలు. కొవిడ్‌-19 పాజిటివ్‌ వస్తే.. పరిహారాన్ని అందిస్తామని చెప్పాయి. రోజు రోజుకు కేసులు పెరిగిపోవటం వల్ల పరిహారాన్ని ఇవ్వడం మానేశాయి. దీంతో కరోనా కోసం ప్రత్యేకంగా రెండు రకాల పాలసీలను తీసుకురావాలని గతనెల ప్రారంభంలో నియంత్రణ సంస్థ కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. మరి ఈ కొత్త పాలసీలు వస్తాయా? వస్తే ఎప్పుడు వస్తాయి?

Coronavirus Health Insurance: Buy COVID-19 Insurance Policy
కొవిడ్‌ బీమా పాలసీలు ఇంకా ఎన్నాళ్లకో..
author img

By

Published : Jul 2, 2020, 7:12 AM IST

మార్కెట్లోకి కొత్త పాలసీలను విడుదల చేసేందుకు జీవిత, సాధారణ బీమా సంస్థలు పోటీ పడుతుంటాయి. పాలసీలను తీసుకొచ్చేందుకు వాటికవే అవకాశాలను సృష్టించుకుంటాయి. దేశంలో కరోనా మహమ్మారి ఇంకా తన విశ్వరూపం చూపించని రోజుల్లోనే.. తక్కువ ప్రీమియానికే కరోనా పాలసీలు.. అంటూ వరసకట్టాయి. బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏ) 'శాండ్‌బాక్స్'ను ఉపయోగించుకుని, వినూత్న పాలసీలు తీసుకొచ్చామని చెప్పుకున్నాయి. చాలా సాధారణ బీమా సంస్థలు బ్యాంకులు, వ్యాలెట్లు, మొబైల్‌ నెట్‌వర్క్‌లతో కలిసి ఆన్‌లైన్‌లో పాలసీలను అందించాయి. అయితే, ఇవన్నీ రూ.25వేలు-రూ.లక్ష మధ్యలోనే ఉండేవి. కొవిడ్‌-19 పాజిటివ్‌ వస్తే.. ఈ పరిహారాన్ని అందిస్తామని చెప్పాయి. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇప్పటికే తీసుకున్న ఆరోగ్య బీమా పాలసీల్లో కరోనా చికిత్సకు పరిహారం ఇవ్వాల్సిందేనని ఐఆర్‌డీఏ చెప్పడంతో బీమా సంస్థలు ఈ ప్రత్యేక పాలసీల జోరును తగ్గించాయి. కొన్ని బీమా సంస్థలు వాటిని ఇవ్వడం మానేశాయి కూడా. ఇక 'డిసీజ్‌ స్పెసిఫిక్'గా కరోనా కోసం ప్రత్యేకంగా రెండు రకాల పాలసీలను తీసుకురావాలని గతనెల ప్రారంభంలో నియంత్రణ సంస్థ కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. అన్ని బీమా సంస్థలూ ఒకే ప్రామాణిక నిబంధనలతో ఈ పాలసీలను తీసుకురావాలని తెలిపింది. ముందు జూన్‌ 15 వరకూ పాలసీలను అందుబాటులోకి తేవాలని చెప్పింది. తర్వాత జూన్‌ 30కి గడువు పెంచింది. బీమా సంస్థలు మరింత సమయం కావాలని అడగటంతో జులై 10 లోగా కొత్త పాలసీలను తేవాలని మరోసారి మార్గదర్శకాలు, పాలసీల పేర్లనూ (కరోనా కవచ్‌, కరోనా రక్షక్‌) విడుదల చేసింది. అయితే.. ఈసారికైనా ఈ కొత్త పాలసీలు వస్తాయా? అనేది ఇప్పుడు అందరిలోనూ నెలకొన్న సందేహం..

  • కరోనా వైరస్‌.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మహమ్మారి..
  • చికిత్స కోసం రూ.లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి..
  • ఆరోగ్యం కుదుటపడ్డా.. ఇది మిగిల్చే ఆర్థిక భారం మాత్రం కోలుకోలేని దెబ్బే..
  • మీకు అనారోగ్యం వస్తే మేమున్నాం... అంటూ ప్రకటనలు చేసే బీమా సంస్థలు..
  • కరోనా పాలసీల విషయంలో మాత్రం ఇదుగో వస్తున్నాం.. అదుగో తెస్తున్నాం...అంటున్నాయి కానీ, ఇప్పటికీ ముందుకు రావట్లేదు..
  • ఐఆర్‌డీఏ మార్గదర్శకాలనూ.. చూసీచూడనట్లు వదిలేస్తున్నాయి...

ప్రీమియం ఎంతో..

సాధారణంగా ఆరోగ్య బీమా పాలసీలను రూపొందించి, వాటికి ప్రీమియం నిర్ణయించేముందు.. ఆయా వ్యాధుల చికిత్సకు ఎంత ఖర్చవుతుంది? అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఆ జబ్బు ఎంతమందిపై ప్రభావం చూపిస్తోంది.. ప్రాంతాల వారీగా ప్రీమియం ఎలా ఉండాలి.. ఇలాంటివన్నీ బీమా సంస్థ లెక్కలు వేస్తుంది. ఐఆర్‌డీఏ కరోనా కోసం తెచ్చే పాలసీలకు మార్గదర్శకాలను రూపొందించింది. ప్రీమియం నిర్ణయాధికారం బీమా సంస్థకే ఉన్నా.. దేశం మొత్తం అదే ప్రీమియం ఉండాలని నిబంధన విధించింది. ప్రస్తుత కష్టకాలంలో బీమా సంస్థలు ఇష్టానుసారం పాలసీలు తీసుకురాకుండా ఇది కట్టడి చేసేదే. కానీ, దీన్ని సాకుగా చూపిస్తూ.. ప్రీమియం నిర్ణయించడానికి కాస్త సమయం పడుతుందని చెబుతూ.. బీమా సంస్థలు పాలసీల విడుదలను జాప్యం చేస్తున్నాయి. ‘ఐఆర్‌డీఏ చెప్పింది కాబట్టి, కచ్చితంగా పాలసీలు తీసుకురావాల్సిందే. కానీ వీటికి ఆదరణ లభించకుండా చేసేందుకు అధిక ప్రీమియాన్ని నిర్ణయించే ఆస్కారం లేకపోలేదని’ బీమా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పూర్తిస్థాయి బీమా తీసుకోరని..

కొవిడ్‌-19తో వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రతి ఒక్కరికీ శ్రద్ధ పెరిగింది. అన్ని రంగాల్లోనూ ఇబ్బందులు ఎదురై.. వ్యక్తుల ఆదాయం తగ్గింది. ఈ సమయంలో అనారోగ్యం బారిన పడితే.. ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయని అందరికీ అవగాహనా పెరిగింది. దీంతో ఆరోగ్య బీమా పాలసీలపై చాలామంది దృష్టి పెట్టారు. ఇప్పటికీ ఈ పాలసీలు లేనివారు.. వీలైనంత తొందరగా పాలసీలను తీసుకునేందుకు ముందుకొస్తున్నారు. ఈ గిరాకీని బీమా సంస్థలు సొమ్ము చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఉన్న పాలసీలను విక్రయించేందుకు కొన్ని నిబంధనలూ సడలించేందుకు సిద్ధం అయ్యాయి. కొన్ని బీమా సంస్థలైతే.. పాలసీదారు చెప్పిన ఆరోగ్య వివరాలనే తీసుకొని, పాలసీలు అందించాయి.

పాలసీదారుల సంఖ్య పెంచుకోవడమే లక్ష్యంగా ఇవి పనిచేశాయి. ఇప్పుడు కొత్తగా కరోనా ప్రత్యేక పాలసీలను తీసుకొస్తే.. ఇక పూర్తిస్థాయి బీమా పాలసీలను తీసుకునేందుకు ఎవరూ ముందుకురారని బీమా సంస్థలు సందేహిస్తున్నట్లు కనిపిస్తోంది. తక్కువ ప్రీమియంతో ఉండే ఈ పాలసీలతోపాటు, ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాకు మించిందేమీ లేదనే అభిప్రాయంతో ఉన్న పాలసీదారులు ఈ ప్రత్యేక పాలసీలు తీసుకుంటే.. తమ వ్యాపారం తగ్గుతుందని ఇవి భావిస్తున్నాయి.

భారం రూ.లక్షల్లోనే..

ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడాన్ని పక్కన పెడితే.. ప్రైవేటులో చికిత్స చేయించుకునేందుకు రూ.లక్షల్లోనే ఖర్చవుతున్న ఉదంతాలు మనం చూస్తూనే ఉన్నాం. ఒకరికి వస్తే.. కుటుంబ సభ్యులనంతా చుట్టేస్తున్న తరుణంలో.. నలుగురు సభ్యులున్న కుటుంబానికి ఇది ఎంత భారం? దాన్ని తట్టుకోవడం ఎలా? ఇప్పుడు చాలామంది మదిలో ఉన్న పెద్ద సందేహమిదే.. చాలామందికి ఎలాంటి లక్షణాలు లేకపోయినా కరోనా పాజిటివ్‌గా తేలుతోంది. ఇలాంటప్పుడు హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పుడు దీనికీ ప్రత్యేకంగా ప్యాకేజీలను అందిస్తున్నాయి పలు ఆసుపత్రులు. 7 రోజులకు కనీసం రూ.20వేల నుంచి ఇవి ఉంటున్నాయి. అంటే.. ఎంతలేదన్నా కుటుంబానికి రూ.లక్ష తీసి, పక్కన పెట్టాల్సిందే. ఇప్పటికే ఆరోగ్య బీమా పాలసీలున్నప్పటికీ.. ఇవి హోంక్వారంటైన్‌ ఖర్చులను చెల్లించడం లేదు.

ఇటీవల ఒక ప్రైవేటు బీమా సంస్థ ఇంట్లో ఉండి చికిత్స చేయించుకున్న వారికీ దీన్ని వర్తింపచేస్తామని చెప్పినా.. కొన్ని పరిమితులు పెట్టింది. ఇక ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకున్న వారికీ.. పీపీఈ కిట్లు, ఇతర ఖర్చులను మినహాయిస్తున్నాయి. వీటికే రూ.15,000 నుంచి రూ.30,000 వరకూ ఖర్చవుతోంది. వీటితోపాటు కొన్ని అదనపు ఖర్చులు సరేసరి. కొత్తగా వచ్చే కరోనా కవచ్‌ ఇండెమ్నిటీ పాలసీలో ఇంట్లో చేయించుకునే చికిత్స ఖర్చులకు గరిష్ఠంగా 14 రోజుల ఖర్చులు చెల్లించాలని నిబంధన ఉంది. కానీ, కరోనా రక్షక్‌ బెనిఫిట్‌ పాలసీలో మాత్రం 72 గంటలు ఆసుపత్రిలో ఉంటే పాలసీ విలువ మేరకు పరిహారం ఇస్తారు. ఈ పాలసీల్లో 15 రోజులు వేచి ఉండే కాలం ఉంటుంది. ఈ కొత్త పాలసీల్లో పీపీఈ కిట్లకు, ఆయుష్‌ చికిత్సకూ పరిహారం వస్తుంది. కరోనా విజృంభిస్తున్న వేళ.. ఈ పాలసీలు ఎంత తొందరగా తీసుకుంటే అంత మేలు అని నిపుణుల అభిప్రాయం. ఇప్పటికిప్పుడు ఈ పాలసీలు వచ్చినా.. 15 రోజుల వరకూ ఉపయోగం ఉండదని వారు పేర్కొంటున్నారు.

వ్యవధి పెంచాలి

ఐఆర్‌డీఏ ప్రతిపాదించిన కరోనా రక్షక్‌, కరోనా కవచ్‌ పాలసీల వ్యవధి మూడున్నర, ఆరున్నర, తొమ్మిదిన్నర నెలల వ్యవధి ఉంది. ఇక్కడ మరో చిక్కుముడి ఉంది. కరోనా ఎప్పుడు మనల్ని కబళిస్తుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో తక్కువ వ్యవధికి పాలసీని తీసుకుంటే ఏమాత్రం ఉపయోగం ఉండదు. ‘కరోనా చికిత్సకు అధిక మొత్తంలో క్లెయిమ్‌ చేసుకుంటే.. ఆ ప్రభావం కొత్తగా తీసుకునే పాలసీలపై పడే అవకాశం ఉంది. కొవిడ్‌-19 నుంచి కోలుకున్న తర్వాత ఇతర అనారోగ్యాలేమైనా వస్తే.. బీమా సంస్థలు పాలసీలు ఇచ్చేందుకు తిరస్కరించే ప్రమాదం లేకపోలేదు. ఇది కొంత ఇబ్బందికరమైన పరిణామమే’ అంటున్నారు బీమా నిపుణులు.

కరోనా కోసం తీసుకొచ్చిన ఈ పాలసీల వ్యవధి కనీసం ఏడాదికి తగ్గకుండా ఉంటే బాగుండేదని నిపుణుల అభిప్రాయం. అయితే, పేరుకే ఈ పాలసీలను తీసుకురావడం వల్ల ఉపయోగం లేదని.. వీటిని అందుబాటు ధర ప్రీమియానికి అందించినప్పుడే ఫలితం ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే ఐఆర్‌డీఏ మార్గదర్శకాలతో వచ్చిన 'ఆరోగ్య సంజీవని' పాలసీని ఏ బీమా సంస్థ కూడా పెద్దగా ప్రచారం చేయడం లేదు. పైగా ఆయా కంపెనీల అత్యుత్తమ పాలసీలకన్నా.. ప్రీమియాన్ని అధికంగా విధించాయి. ఈ పాలసీలూ అలాగే వస్తే.. ఈ కష్టకాలంలో సామాన్యుడికి భరోసా లభించేది కష్టమే.

ఇదీ చూడండి:వాహన విక్రయాలకు కరోనా సెగ.. భారీగా తగ్గిన అమ్మకాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.