దేశీయ స్టాక్‌మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగుతోంది. కరోనా భయాలతో అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు నెలకొనడం, దేశీయంగా కీలక రంగాల షేర్లు కుదేలైన వేళ ఇవాళ కూడా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 392 పాయింట్లు కోల్పోయి 39 వేల 888 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 119 పాయింట్లు నష్టపోయి 11 వేల 678 వద్ద స్థిరపడింది.
లాభనష్టాల్లో
ఎస్ బ్యాంకు, భారతీ ఇన్ఫ్రాటెల్, ఎస్బీఐ, బ్రిటానియా, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌యూఎల్, ఏసియన్ పెయింట్స్, ఆల్ట్రాటెక్ సిమెంట్ రాణించాయి.
గెయిల్, సన్‌ఫార్మా, టాటా మోటార్స్, మారుతి సుజుకి, హిందాల్కో, లార్సెన్ అండ్ టుబ్రో, ఇన్ఫోసిస్ నష్టాలపాలయ్యాయి.
ఆసియా మార్కెట్లు
కరోనా భయాలతో ఆసియా మార్కెట్లు నిక్కీ, హాంగ్‌సెంగ్, కోస్పీ, షాంగై కాంపోజిట్ నష్టాలు చవిచూశాయి. మరోవైపు ఐరోపా స్టాక్ ఎక్స్ఛేంజిలు ఉదయం సెషన్లో నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. వాల్‌స్ట్రీట్ కూడా నిన్న నష్టాలతో ముగిసింది.
రూపాయి విలువ
రూపాయి విలువ 21 పైసలు పెరిగింది. ప్రస్తుతం ఒక డాలరుకు రూ.71.64గా ఉంది.
ముడిచమురు ధర
అంతర్జాతీయంగా ముడిచమురు ధర 1.77 శాతం తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 53.30 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: 'కరోనా భూతం వల్ల ప్రపంచానికి మాంద్యం ముప్పు'