ETV Bharat / business

ఉద్దీపన చర్యలు లేని 'నిస్సార' బడ్జెట్​: కాంగ్రెస్​ - ఉద్దీపన చర్యలు లేని 'నిస్సార' బడ్జెట్​

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్​పై విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఎలాంటి ఉద్దీపన చర్యలు లేని నిస్సార పద్దుగా పేర్కొంది కాంగ్రెస్​. యువతకు ఉద్యోగాల కల్పనపై కచ్చితమైన, వ్యూహాత్మక ప్రణాళిక ఏమీ కనిపించలేదన్నారు రాహుల్​ గాంధీ. పన్ను మినహాయింపుల తొలగింపును తప్పుబట్టింది టీఎంసీ.

Cong slams budget
ఉద్దీపన చర్యలు లేని 'నిస్సార' బడ్జెట్​: కాంగ్రెస్​
author img

By

Published : Feb 1, 2020, 3:05 PM IST

Updated : Feb 28, 2020, 6:49 PM IST

ఉద్దీపన చర్యలు లేని 'నిస్సార' బడ్జెట్​: కాంగ్రెస్​

కేంద్ర ప్రభుత్వం లోక్​సభలో ప్రవేశపెట్టిన వార్షిక ఆదాయ వ్యయ పద్దుపై తీవ్ర విమర్శలు చేసింది కాంగ్రెస్​ పార్టీ. నిస్సారమైన బడ్జెట్​గా పేర్కొంది. మందగమనం పరిస్థితుల్లోనూ ఉద్దీపన చర్యలేవీ ప్రకటించలేదని విమర్శించింది. అరకొర చర్యలు, ఉన్న పథకాలనే తిరిగి ప్రకటన, పన్ను స్లాబ్​ల గారడీకి పరిమితమే... ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడానికి పరిష్కారాలు చూపలేదని దుయ్యబట్టింది.

పద్దుపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ.

"ప్రస్తుత ప్రధాన సమస్య నిరుద్యోగం. యువత ఉద్యోగాలు పొందేందుకు ఎలాంటి కచ్చితమైన, వ్యూహాత్మక ప్రణాళిక కనిపించలేదు. పాత విషయాలనే మళ్లీ మళ్లీ చెప్పారు. ఇదే ప్రభుత్వ మనస్తత్వం. అన్ని మాట్లాడినప్పటికీ ఏమీ జరగదు. చరిత్ర చూసుకుంటే బడ్జెట్​ ప్రసంగాల్లో ఇదే అత్యంత సుదీర్ఘమైనది అనుకుంటా. కానీ అందులో ఏమీ లేదు. అంతా డొల్ల."

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత.

ఇదేం తీరు: టీఎంసీ

పన్ను మినహాయింపుల తొలగింపును తప్పుబట్టింది తృణమూల్​ కాంగ్రెస్​. ప్రజలకు సరైన సామాజిక భద్రత లేని దేశంలో ఈ నిర్ణయం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని విమర్శించింది.

ప్రజల సమస్యలు తీర్చే చర్యలేమీ లేవు: సీపీఎం

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్​లో.. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు లేవని విమర్శించింది సీపీఎం. సాధారణ ప్రకటనలు, నినాదాలు మినహా సమస్యలు తీర్చేవిగా ప్రణాళికలు లేవన్నారు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి.

ఇదీ చూడండి: పద్దు 2020 : సాగుకు పెద్దపీట- ఉద్యోగులకు శుభవార్త

Last Updated : Feb 28, 2020, 6:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.