LPG Cylinder Price: కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ఉపయోగించే వారికి కాస్త ఊరట లభించింది. వాణిజ్య సిలిండర్ ధరను రూ.91 తగ్గించాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. దీంతో దేశ రాజధానిలో రూ.2000కుపైగా ఉన్న ఈ సిలిండిర్ ధర రూ.1907కు దిగొచ్చింది. సవరించిన ధరలు మంగళవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చినట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి.
కమర్షియల్ సిలిండర్ ధర తరచూ పెరగడం వల్ల చిన్న వ్యాపారస్థులు, హెటల్స్, రెస్టారెంట్ నిర్వాహకులపై భారం పెరుగుతూ వస్తోంది. ధర తగ్గింపుతో వారికి కాస్త ఉపశమనం లభించనుంది.
ATF Fuel Price Hike: మరోవైపు విమాన ఇంధన (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్-ఏటీఎఫ్) ధరను రికార్డు స్థాయిలో 8.5శాతం పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. దీంతో దిల్లీలో కిలో లీటర్ ఏటీఎఫ్ ధర రూ. 6,743 పెరిగి 86,038కి చేరింది. ఏటీఎఫ్ చరిత్రలో ఇదే అత్యధిక ధర కావడం గమనార్హం. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు తెలిపాయి.
గతంలో 2008లో క్రూడ్ ఆయిల్ ధర బ్యారల్ 147కి చేరినప్పుడు ఏటీఎఫ్ ధర 71,028గా ఉంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర 91 డాలర్లుగానే ఉన్నా.. విమాన ఇంధన ధర రూ.86వేలకుపైగా చేరింది.
తాజా పెంపుతో విమాన ఇంధన ధర నెల రోజుల వ్యవధిలో మూడోసారి పెరిగినట్లయింది. ఇప్పటికే జనవరి 1న 2.5శాతం, జనవరి 16న 4.25 శాతం ధరలు పెరిగాయి. ఇప్పుడు ఏకంగా 8.5శాతం పెరిగింది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: నేడే కేంద్ర పద్దు.. ఊరటనిస్తారా.. ఉసూరుమనిపిస్తారా.!