ETV Bharat / business

వరుసగా రెండో సెషన్​లోనూ​ లాభాలే.. - వేదాంత

సానుకూల సంకేతాలతో స్టాక్​మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాలనే నమోదుచేశాయి. సెన్సెక్స్ 150 పాయింట్లకు పైగా పెరిగింది. నిఫ్టీ.. 11 వేల 850కి చేరువైంది. జూన్​ డెరివేటివ్​ల గడువు నేపథ్యంలో కొనుగోళ్లు పెరిగాయి.

వరుసగా రెండో సెషన్​లోనూ​ లాభాలే..
author img

By

Published : Jun 26, 2019, 4:10 PM IST

Updated : Jun 26, 2019, 4:31 PM IST

ఐటీ, ఎఫ్​ఎంసీజీ మినహా... అన్ని రంగాల్లో షేర్ల కొనుగోళ్లతో స్టాక్​మార్కెట్లు లాభాలతో ముగిశాయి. వరుసగా రెండో సెషన్​లోనూ సూచీలు సానుకూలంగానే ట్రేడయ్యాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్​ 157 పాయింట్లు పెరిగింది. 39 వేల 592 వద్ద సెషన్​ను ముగించింది. ఇంట్రాడేలో 39 వేల 320 పాయింట్ల కనిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్​.. అనంతరం 39 వేల 674 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని చేరింది.

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ- నిఫ్టీ 51 పాయింట్లు లాభపడింది. 11 వేల 847 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో నిఫ్టీ 11,758-11, 872 మధ్య కదలాడింది.

మొత్తం 1418 షేర్లు పుంజుకున్నాయి. 1051 షేర్లు నష్టాల్లోకి వెళ్లాయి.

జూన్​ డెరివేటివ్స్ గురువారం​ ముగుస్తున్న తరుణంలో ఫార్మా, లోహ, ఇన్​ఫ్రా, బ్యాంకింగ్​ రంగాలకు కొనుగోళ్ల మద్దతు లభించింది.

పాంపియో, మోదీ భేటీలో వాణిజ్యంపై సానుకూల వార్తలు రావచ్చనే ఆశలు మదుపర్లలో ఉత్తేజాన్ని నింపాయి.

వేదాంత, పవర్​గ్రిడ్​కు లాభాలు..

నేటి ట్రేడింగ్​లో వేదాంత ఉత్తమ లాభాలను నమోదుచేసింది. 4.40 శాతం మేర లాభపడింది. పవర్​గ్రిడ్​, సన్​ ఫార్మా, యస్​ బ్యాంక్​, టాటా స్టీల్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, బజాజ్​ ఫినాన్స్​, బజాజ్​ ఆటో లాభాల్లో ఉన్నాయి.

టోరెంట్​ పవర్​ షేర్లు 52 వారాల గరిష్ఠానికి చేరాయి. ఇంట్రాడేలో 2.55 శాతం లాభాలొచ్చాయి.

ఇన్ఫోసిస్​, టెక్​మహీంద్రా, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, భారతీ ఎయిర్​టెల్​, మారుతీ సుజుకీ, టీసీఎస్, హెచ్​డీఎఫ్​సీ ఒక శాతంపైగా నష్టపోయాయి.

రూపాయి మెరుగు...

ఇంట్రాడేలో రూపాయి బలపడింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ.. 22 పైసలు వృద్ధి చెంది 69.13 వద్ద ఉంది.

అంతర్జాతీయంగా షాంఘై, హాంగ్​ కాంగ్​, టోక్యో, సియోల్ మార్కెట్ల సూచీలు మిశ్రమ ఫలితాలతో ముగిశాయి.

ఇదీ చూడండి:

ప్రభుత్వ అధికారిపై బ్యాటుతో ఎమ్మెల్యే వీరంగం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
   
AGENCY POOL - AP CLIENTS ONLY
Seoul – 26 June 2019
1. Wide pan of welcome ceremony
2. Saudi Arabia's Crown Prince Mohammed bin Salman and South Korean President Moon Jae-in standing during ceremony
3. Officials
4. Various of welcome ceremony
5. Salman and Moon shaking hands  
5. Various of meeting
6. Various of Salman, Moon and officials during memorandum of understanding signing
7. Salman
8. Salman and Moon leaving
STORYLINE:
Saudi Arabia's Crown Prince Mohammed bin Salman met South Korean President Moon Jae-in in Seoul on Wednesday.
The meetings were expected to focus on improving economic cooperation and bilateral ties, according to local broadcaster Yonhap.
Yonhap reported that Moon is also expected to ask for support of South Korea's peace efforts on the Korean Peninsula.
During Salman's two-day visit, he will also meet South Korean business leaders and partner companies.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jun 26, 2019, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.