China Real Estate Crisis: చైనా స్థిరాస్తి రంగంలో సంక్షోభం మరింత ముదురుతోంది. ఇప్పటికే ఆ దేశంలో రెండో అతిపెద్ద సంస్థ ఎవర్‌గ్రాండె బాండ్లు, రుణాలను చెల్లించలేనని చేతులెత్తేసిన నేపథ్యంలో.. మరో కంపెనీ కూడా అదే బాట పట్టనుంది. హాంకాంగ్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న కైసా గ్రూప్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ వచ్చే వారంలో కట్టాల్సిన నాలుగు మిలియన్ డాలర్ల బాండ్‌ను తిరిగి చెల్లించకపోవచ్చని తెలుస్తోంది. దీనిపై ఈ మంగళవారం బాండ్ హోల్డర్లతో చర్చించినట్లు సంస్థ పేర్కొంది. అయితే కొంతమంది మాత్రమే ఇందుకు సమ్మతించినట్లు తెలిపింది.
అప్పు తెచ్చుకున్న సొమ్ము వినియోగంపై ఉన్న పరిమితులను గతేడాది రెగ్యులేటర్లు కఠినతరం చేశాయి. ఈ నేపథ్యంలో చాలా రియల్ ఎస్టేట్ సంస్థలు రుణాన్ని తగ్గించుకోవడానికి చూస్తున్నాయి. దీంతో చైనా రియల్ ఎస్టేట్ కంపెనీలు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతున్నాయి.
ఇవీ చూడండి: