ETV Bharat / business

ఇవి తెలుసుకున్నాకే.. స్మార్ట్ ఫోన్ కొనండి - ఈటీవీ భారత్​

ఇది స్మార్ట్​ఫోన్​ యుగం. ఎటు చూసినా స్మార్ట్​ ఫోన్లే కనిపిస్తాయి. దానికి తగ్గట్టే.. మార్కెట్​లో ఎన్నో బ్రాండ్లు, ఎన్నో మోడళ్లు. మరి ఏ స్మార్ట్​ ఫోన్​ కొనాలి? అసలు స్మార్ట్​ఫోన్​ తీసుకునే ముందు ఏవేవి చూడాలి?

Check out these details before purchasing a smart phone
ఇవి తెలుసుకున్నాకే ..స్మార్ట్ ఫోన్ కొనండి
author img

By

Published : Feb 13, 2021, 9:56 PM IST

ఎక్కడ చూసినా స్మార్ట్ ఫోన్లే. ప్రపంచాన్ని ఏలేస్తున్నాయ్. కరోనా ముట్టడిలో చిక్కుకున్న మానవాళికి ఇవి వరంలా మారాయి. విడదీయలేనంతగా మన జీవితాలతో ముడివేసుకుపోయాయి. విద్య నుంచి వైద్యం వరకు.. ఆన్‌లైన్ కొనుగోళ్ల నుంచి టిక్కెట్లు బుక్ చేయడం వరకు.. ప్రతిదానికీ స్మార్ట్ ఫోన్ దగ్గర ఉండాల్సిందే. స్మార్ట్ ఫోన్లు లేకుండా క్షణం గడవదు. ఇందులో ఆశ్యర్యం ఏముంది? ఇదంతా మీకూ తెలిసిందే. అయితే.. మార్కెట్‌లో బెస్ట్ ఫోను కొనడం ఎలా అనేదే సమస్య. స్మార్ట్ ఫోన్ కొనేముందు ప్రతిఒక్కరూ తెలుసుకుని తీరాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి.. అవేమిటో కన్జూమర్ వాయిస్ సంస్థ మీతో షేర్ చేసుకుంటోంది. అవేమిటో చూద్దాం..

ఒక కంపెనీ కెమెరా క్వాలిటీ అద్భుతం అంటుంది. మరొకటి ప్రాసెపర్ వేగం గురించి ఊదరగొడుతుంది. సరైన స్మార్ట్ ఫోన్ ఎంచుకోవడం ఇప్పటంత కష్టంగా ఎప్పుడూ లేదు. నిజంగా ఇదొక ఛాలెంజే. మీ పని తేలిక చేసేందుకు కన్జూమర్ వాయిస్ మార్కెట్లో సమగ్రంగా ఒక ప్రోడక్ట్ సర్వే చేసింది. ఈ సర్వేలో 15 బ్రాండ్స్‌ను కూలంకషంగా అధ్యయనం చేసింది.. మీరొక మంచి ఫోన్ ఎంచుకోడానికి ఈ సర్వే సాయపడుతుంది.

ముందుగానే తెలుసుకోండి..

ప్రాసెసర్: ఫోన్‌కు ఇది గుండెకాయ. డివైస్​ అంతరాయం లేకుండా ఎల్లవేళలా పనిచేయాలంటే సమర్ధవంతమైన ప్రాసెసర్ ఉండాలి. మంచి ప్రాసెసర్‌ అన్ని విషయాల్లోనూ ఫోన్‌ సామర్ధ్యాన్ని పెంచుతుంది. స్మార్ట్ ఫోన్ ప్రాసెసింగ్ పవర్ డివైజ్‌ను బట్టి మారుతూ ఉంటుంది. ఫోన్‌కు వాడే ఓఎస్ వెర్షన్, యూజర్ ఇంటర్‌ఫేస్​, బ్లోట్‌వేర్, ఇలా చాలా అంశాలు ప్రాసెసింగ్ సామర్ధ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే మీరు ఫోన్ కొనే ముందు అందులో వాడిన ప్రాసెసర్ గురించి తెలుసుకోవాలి.

బ్యాటరీ: పవర్‌ఫుల్ బ్యాటరీ ఉండటం ఇవ్వాళా రేపు తప్పనిసరి. ఎంత శక్తి ఉన్న బ్యాటరీ అయినా సరే చివరకు మీ వాడకాన్ని బట్టి దాని పనితీరు ఆధారపడి ఉంటుంది. మీ వాడకం మరీ భారీగా ఉంటుందా? అంతర్జాలం, యాప్‌లు ఎక్కువగా వాడతారా? గేములు ఆడతారా?, స్ట్రీమింగ్ వీడియోలు చూస్తారా? అవును అన్నారంటే.. మీరు కనీసం 3500 ఎంఏహెచ్, లేదా అంతకు మించిన శక్తి ఉండే బ్యాటరీకి వెళ్లండి. అంత సీను లేదు, లైట్ యూజర్‌నే అంటారా? అలా అయితే 3000 ఎంఏహెచ్ బ్యాటరీ మీకు సరిపోతుంది. ఒక రోజంతా వస్తుంది. పెద్ద ఫోన్లతో పాటు కొన్ని మధ్యస్థాయి ఫోన్లు కూడా 8-10 గంటల ‘స్క్రీన్ ఆన్’ టైమ్ బ్యాటరీతో వస్తున్నాయి. అంతకంటే ఇంకేం కావాలి? అదేపనిగా వాడుతూ ఉన్నా ఒక పూర్తి రోజు నడిచే ఫోన్ ఉండటం ప్రధానం.

ఆపరేటింగ్ సిస్టం: ఈ విషయంలో ప్రధానంగా రెండే ఛాయిస్​లు ఉన్నాయి. ఒకటి ఆండ్రాయిడ్, రెండోది ఐఓఎస్. ఐఓఎస్ ఫోన్లు (ఐఫోన్లు) ఆండ్రాయిడ్ కంటే ఖరీదైనవి. మనం ఫోన్‌తో ఏ పని చేయాలన్నా.. అలాంటి ప్రతిసారీ ఆపరేటింగ్ సిస్టంను యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. దీన్నే ఇంటర్‌ఫేస్ అంటారు. ఇంటర్‌ఫేస్ నిరంతరం అవసరం అయ్యేది కాబట్టి.. ఇది సులభంగా సరళంగా ఉండాలి. యాపిల్ ఐఫోన్‌ ఓఎస్ (ఐఓఎస్)కు గూగుల్ ఆండ్రాయిడ్‌కు తేడా ఏమిటి అన్నది.. ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం.

గూగుల్ ఆండ్రాయిడ్: దీన్ని వాడటం సులభం. మనక్కావలసిన తీరులో మార్పులు చేర్పులు చేసుకునే వీలుంటుంది. గూగుల్ ప్లేస్టోర్‌లో విస్తృత శ్రేణిలో పలు రకాల యాప్‌లు, గేములు, వినోదాలు లభిస్తాయి. మీ బడ్జెట్ బట్టి ఎంపిక చేసుకోడానికి కుప్పలు తెప్పలుగా ఆండ్రాయిడ్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

యాపిల్ హ్యాండ్‌సెట్ల కంటే ఆండ్రాయిడ్‌ ఫోన్లకు హ్యాకింగ్ దాడుల ముప్పు ఎక్కువన్నది మనకు తెల్సిందే. అయితే ఇప్పుడీ పరిస్థితి మారుతోంది. మోసకారి యాప్‌లు ప్లే స్టోర్‌లో ప్రవేశించకుండా.. గూగుల్ గతంలో కంటే ఎక్కువ జాగ్రత్త తీసుకుంటోంది. భద్రతాపరమైన లోపాలను చక్కదిద్దడానికి తరచుగా ప్యాచ్‌లు రిలీజ్ చేస్తోంది.

యాపిల్ ఐఫోన్ ఓఎస్ (ఐఓఎస్): మీరు గతంలో స్మార్ట్ ఫోన్ వాడకపోయినా ఫర్వాలేదు. దీన్ని ఉపయోగించడం తేలిక. తొందరగా నేర్చుకోవచ్చు. ఇందులోనూ అనేక యాప్‌లతో కూడిన యాపిల్ యాప్‌ స్టోర్ ఉంటుంది. ప్రత్యేకత ఏమిటంటే రిలీజ్‌కు ముందుగానే తనిఖీకి గురై పూర్తి ఆమోదం పొందిన యాప్‌లే ఇందులో ఉంటయి. కాబట్టి మీరు నిశ్చింతగా వీటిని వాడుకోవచ్చు.

ఏమైనప్పటికీ ఐఫోన్లు బాగా ఖరీదైనవి. అందరికీ అందుబాటులో ఉండేవి కావు. తాజా టెక్నాలజీ పట్ల మీకు అంతగా పట్టింపు లేనట్లయితే.. పాత మోడల్ హ్యాండ్‌సెట్లు చవకగా దొరుకుతాయి.

స్టోరేజీ: ఈ రోజుల్లో చాలా పనులు స్మార్ట్ ఫోన్లతోనే నడిచిపోతున్నాయి. వివిధ రకాల డాక్యుమెంట్లు, ఫైళ్లు, ఫొటోలు, యాప్‌ల డౌన్‌లోడింగ్, అప్‌లోడింగ్ కార్యకలాపాాలకు చాలా స్థలం అవసరమవుతుంది. సినిమాలు నిల్వ చేసుకునేవారికి, భారీస్థాయి గేములు ఆడేవారికి ఫోన్లో అధిక స్టోరేజ్ సదుపాయం ఉండాాలి. అర్ధాంతరంగా ఫోన్ స్తంభించిపోవడం, అప్లికేషన్లు స్లో కావడం జరక్కూడదు అనుకుంటే కనీసం 32 గిగాబైట్ల స్టోరేజ్ ఉండాలి.

బిల్డ్: స్మార్ట్ ఫోన్ మన్నిక ప్రధానంగా దాని నిర్మాణ రీతిపై ఆధారపడి ఉంటుంది. తయారీ (బిల్డ్) రీత్యా హ్యండ్‌సెట్లు రెండు రకాలు. మెటల్‌తో చేసినవి, ప్లాస్టిక్‌వి. ఏ బిల్డ్ అనేది మీరు వాడుకునే దాన్ని బట్టి ఎంపిక చేసుకోవాలి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.