ETV Bharat / business

ఇళ్ల కొనుగోళ్లలో మారిన ట్రెండ్​.. వాటికే ప్రాధాన్యం! - ఇళ్ల కొనుగోలులో మార్పు

స్థిరాస్తి రంగాన్ని కొవిడ్​ మహమ్మారి తీవ్రంగా దెబ్బతీసింది. అయితే.. ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న ఈ రంగంలో కొత్తగా ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారి ఆలోచన ధోరణిల్లో మార్పు వచ్చింది. పెద్ద ఇళ్లు, శివారు ప్రాంతాల్లోని వాటికి మొగ్గుచూపుతున్నారు. సీఐఐ ఆన​రాక్​ నిర్వహించిన కొవిడ్​ సెంటిమెంట్​ సర్వే పలు విషయాలు వెల్లడించింది.

Home buying
కొవిడ్ అనంతరం గృహ కొనుగోలు
author img

By

Published : Feb 18, 2021, 5:04 AM IST

కొవిడ్ అనంతరం గృహ కొనుగోలుదారులు విస్తీర్ణంలో పెద్ద ఇంటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అదే విధంగా శివారు ప్రాంతాల్లో ఇళ్లకు, బ్రాండెడ్ డెవలపర్ల ఇళ్లకు మొగ్గు చూపుతున్నారు. సీఐఐ ఆనరా​క్ నిర్వహించిన కొవిడ్ సెంటిమెంట్ సర్వే ఈ విషయాలను వెల్లడించింది. మిలీనియల్స్ కొత్త తరం గృహ కొనుగోలుదారులుగా ఉన్నారని సర్వే తెలిపింది. రియల్ ఎస్టేట్ పెట్టుబడికి ప్రాధాన్యత పెరుగుతోందని..ఎన్ఆర్ఐలు ఎక్కువగా లగ్జరీ గృహాలపై పెట్టుబడులు పెడుతున్నట్లు పేర్కొంది.

సర్వే ప్రకారం.. ఈక్విటీ, బంగారంతో పోల్చితే రియల్ ఎస్టేట్​కు తొలి ప్రాధాన్యం 57 శాతం మంది ఇస్తున్నారు. దీని అనంతరం 24 శాతం మంది ఈక్విటీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో ఇప్పటికే 24 శాతం మంది ఇంటి కొనుగోలు సంబంధించి బుకింగ్ చేసుకున్నారు. 62 శాతం మంది గృహ కొనుగోలుకు ఇది సరైన సమయమని భావిస్తున్నారు. గత సర్వే లాక్​డౌన్ సమయంలో చేసినప్పుడు.. 6 శాతం మంది బుకింగ్స్ చేసుకోగా 54 శాతం మంది ఆ సమయాన్ని సరైన సమయని భావించారు.

శివారు ప్రాంతాలకు ప్రాధాన్యం

కరోనా మహమ్మారి వల్ల 59 శాతం మంది నిర్ణయాలన్ని మార్చుకున్నారని సర్వే వెల్లడించింది. కొవిడ్ కంటే ముందు ఇళ్లు కొనుగోలుపై కచ్చితంగా లేనప్పటికీ.. మహమ్మారి అనంతరం కచ్చితంగా కొనుగోలు చేయాలని అనుకుంటున్నారని పేర్కొంది. 66 శాతం మంది శివారు ప్రాంతాల్లో ఇల్లు కొనుగోలు చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. 84 శాతం మంది 2 బీహెచ్ కే, 3 బీహెచ్ కే లను గతంలో కంటే ఎక్కువ విస్తీర్ణంతో కోరుకుంటున్నారు.

సొంత వినియోగానికి కొనే వారి శాతం పెరిగింది. సొంత ఉపయోగానికి కొనేవారు, పెట్టుబడిపరంగా కొనుగోలు చేసేవారి నిష్పత్తి 74:26గా ఉంది. ఇది కొవిడ్ కంటే ముందు 59:41 గా ఉండేది.

వారి నుంచి సురక్షితం..

కొవిడ్ ముందు 35 శాతం వరకు నివాసానికి సిద్ధంగా ఉన్న ఇళ్లను కొనుగోలు చేసేందుకు ప్రాధాన్యం ఇచ్చే వారు. లాక్​డౌన్​లో ఇది 46 శాతానికి పెరిగిందని.. అయితే ఇప్పుడు 29 శాతానికి పడిపోయిందని సర్వే పేర్కొంది. కొత్తగా నిర్మాణం అవుతోన్న వాటికి లాక్​డౌన్ సమయంలో 18 శాతం మంది ప్రాధాన్యం ఇవ్వగా.. ఇప్పుడు అది 26 శాతానికి పెరిగింది. రెడీ టూ మూవ్ విభాగంలో తక్కువ సరఫరా ఉండటం వల్ల అదే విధంగా కొవిడ్ అనంతరం బ్రాండెడ్ డెవలాపర్లు ఎక్కువ నిర్మాణాలు చేపడుతుండటం.. వారి నుంచి కొనుగోలు చేయటం సురక్షితమని ప్రజలు అనుకోవటమే కారణమని భావిస్తున్నట్లు సర్వే నివేదిక వెల్లడించింది.

కొవిడ్ కంటే ముందు రూ.45 లక్షల లోపు గృహాలకు ప్రాధాన్యం ఇచ్చే వారు 31 శాతం ఉండగా.. అది కొవిడ్ అనంతరం 40 శాతానికి పెరిగింది. అదే సమయంలో రూ.45 లక్షల నుంచి రూ.90 లక్షల ఇళ్లకు రెండో స్థానం ఉండగా.. ప్రాధాన్యం ఇచ్చే వారి శాతం మాత్రం 42 నుంచి 29కి పడిపోయింది. అయితే రూ. 90 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల ఇళ్లకు ప్రాధాన్యత ఇచ్చే వారి శాతం 6 నుంచి 7కు పెరిగింది.

2 బీహెచ్​కేనే ప్రాధాన్యం

కొవిడ్ ముందు, కొవిడ్ అనంతరం కూడా 2 బీహెచ్​కేకే ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే 2 బీహెచ్​కేకు ప్రాధాన్యత ఇస్తున్న వారి శాతం 52 నుంచి 49 శాతానికి తగ్గింది. అదే సమయంలో 3 బీహెచ్​కే కోరుకుంటున్న వారి సంఖ్య 31 శాతం నుంచి 38 శాతానికి పెరిగింది.

కొవిడ్ అనంతరం విస్తీర్ణంలో పెద్ద ఇళ్లు కొనుగోలు చేసే వారు ఎక్కువ చదరపు అడుగులు ఉండే వాటికి మొగ్గుచూపుతున్నారు. అన్ని విభాగాల్లో పెద్ద గృహాలకు డిమాండ్ పెరిగినట్లు అంచనా వేసింది సర్వే. వర్క్​ ఫ్రమ్ హోమ్ వల్ల ఇది మారినట్లు తెలుస్తోంది. తక్కువ ధర ఉంటే శివారు ప్రాంతాలకు వెళ్లాలని చాలా మంది అనుకుంటున్నారని తెలిపింది. కొవిడ్ కంటే ముందు 600 చదరపు అడుగుల కంటే ఎక్కువున్న 2 బీహెచ్​కే ఇళ్లను కేవలం 38 శాతం మంది మాత్రమే మొగ్గు చూపే వారు. అయితే ఇప్పుడు 69 శాతం మంది వాటి కొనుగోలుకు మొగ్గు చూపుతున్నట్లు తెలిపింది సర్వే.

వర్క్​ ఫ్రమ్ హోమ్ వల్ల..

ఆఫీసుకు దగ్గరగా ఉండే గృహాలకు పాపులారిటీ తగ్గిందని సర్వే పేర్కొంది. కేవలం 28 శాతం మంది మాత్రమే నగరంలోపల, కార్యాలయానికి దగ్గరగా నివసించాలనుకుంటున్నట్లు నివేదిక పేర్కొంది. వర్క్​ ఫ్రమ్ హోమ్ అనేది ఇళ్ల కొనుగోలుకు ప్రధాన పాత్ర పోషిస్తుందని నివేదిక పేర్కొంది. 43 శాతం మంది శివారు ప్రాంతాల్లోని పెద్ద గృహాలకు మారాలనుకుంటున్నారని, మంచి జీవన శైలి అందుబాటు ధరలో కావాలనుకుంటున్నారని సర్వే పేర్కొంది.

గడువులోపు నిర్మించగలరనన్న కారణంతో బ్రాండెడ్ డెవలపర్ల వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. కొవిడ్ ముందు 52 శాతం మంది బ్రాండెడ్ డెవలపర్లకు మొగ్గు చూపగా.. ఇప్పుడు వారి శాతం 61కు మారింది. ఆకర్షణీయమైన డీల్స్, ఆఫర్లు ప్రస్తుత కొనుగోళ్లకు ప్రధాన కారణంగా కనబడుతోంది. 36 శాతం మంది మంచి డీల్స్ ఉండే కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. 25 శాతం మంది తక్కువ ధరల్లో గృహాలు ఉండటం వల్ల కొనేందుకు మొగ్గు చూపుతున్నారు.

ఇదీ చూడండి: 'ఎన్నాళ్లు కిరాయి ఇంట్లో ఉంటాం.. చిన్న ఇల్లైనా తీసుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.