ETV Bharat / business

'పెట్రో వాత'తో కేంద్రం ఆదాయం 230% వృద్ధి​! - పెట్రోలియంతో కేంద్రం ఆదాయం

పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు సామాన్యులకు భారంగా మారగా.. ప్రభుత్వానికి కాసుల పంట కురిపించినట్లు తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పెట్రోలియం విభాగం ద్వారా కేంద్ర ఆదాయం 45 శాతానికి పైగా పెరిగినట్లు గణాంకాలు చెబుతుండటమే ఇందుకు ఉదాహరణం. 2020-21లో పెట్రోలియం ద్వారా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు గడించిన ఆదాయం గణాంకాలు ఇలా ఉన్నాయి.

Govt income rise with petroleum
ప్రభుత్వానికి పెరిగిన ఆదాయం
author img

By

Published : Jul 18, 2021, 6:51 PM IST

గత ఏడాది కాలంగా దేశంలో పెట్రోల్​, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. అన్ని ప్రధాన నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.100 పైనే ఉంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పెట్రోల్​, డీజిల్ ధరలు రికార్డు స్థాయి వద్దే కొనసాగుతున్నాయి. ఇలా పెట్రోల్ ధరల పెంపుతో ప్రభుత్వ ఖజానాకు గత ఏడాది భారీగా నిధులు సమకూరినట్లు తెలుస్తోంది.

2020-21లో ఆదాయం 45 శాతం జంప్​..

గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుతానికి పెట్రోలియం విభాగం ద్వారా వచ్చే ఆదాయం 45 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2020-21 ముగింపు సమయానికి (మార్చి 31) దేశంలో పెట్రోల్​ ధర లీటర్​ రూ.90 వద్ద, లీటర్ డీజిల్ ధర రూ.81 వద్ద ఉన్నాయి.

ప్రస్తుతం.. పెట్రోల్ ధర లీటర (దిల్లీలో) రూ.101.54 వద్ద ఉంటే.. డీజిల్ ధర రూ.89.87 వద్ద ఉంది.

కేంద్రం ఆదాయం లెక్కలు ఇలా..

పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా కేంద్రానికి గత ఆర్థిక సంవత్సరం రూ.4,18,637 కోట్ల ఆదాయం లభించింది. ఎక్సైజ్​ డ్యూటీ, కస్టమ్స్​ డ్యూటీ, కేంద్ర రాష్ట్ర జీఎస్​టీ, రాయల్టీ పేమెంట్స్​ అన్నీ కలిపి ఈ ఆదాయాన్ని గడించింది కేంద్రం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ ఆదాయం రూ.2,87,540 కోట్లుగా ఉండటం గమనార్హం. అంటే.. 2019-20తో పోలిస్తే.. గత ఆర్థిక సంవత్సరం కేంద్రం ఆదాయం పెట్రోలియం ద్వారా రూ.1,31,097 కోట్లు (45.59 శాతం) పెరిగింది.

కార్పొరేట్​ పన్నులు, డివిడెండ్​ ఆదాయం, డివిడెండ్ పంపిణీ పన్ను, చమురు, గ్యాస్​ నిక్షేపాల గుర్తింపు ద్వారా లభించిన ఆదాయం చూస్తే.. గత ఆర్థిక సంవత్సరం కేంద్రం మొత్తం రూ.4,53,812 కోట్లు గడించింది.

6 ఏళ్లలో ఆదాయం 230 శాతం జంప్​..

ఎన్​డీఏ ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత.. తొలి ఆర్థిక సంవత్సరమైన 2014-15లో పెట్రోలియం విభాగం ద్వారా కేంద్రం రూ.1,26,025 కోట్ల ఆదాయాన్ని గడించింది. ఆరేళ్ల తర్వాత (2020-21లో) ఆదాయం రూ.4,18,637 కోట్లకు పెరిగింది. అంటే ఆరేళ్ల సమయంలో ఈ రంగం ద్వారా కేంద్రం ఆదాయం 230 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఇదే సమయంలో ఎక్సైజ్​ సుంకాలు.. 275 శాతం పెరిగి.. రూ.99,068 కోట్ల నుంచి రూ.3,71,725 కోట్లకు పెరిగాయని తెలిసింది.

రాష్ట్రాల ఆదాయం అంతంత మాత్రమే..

పెట్రోలియం రంగం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగితే రాష్ట్రాలు మాత్రం కాస్త వెనకబడ్డాయి. రాష్ట్రాల ఆదాయం 2020-21లో (2019-20లో నమోదైన రూ.2,20,841 కోట్లతో పోలిస్తే) రూ.2,17,271 కోట్లకు పడిపోయినట్లు గణాంకాల్లో తేలింది.

ఇదీ చదవండి:ఒపెక్ ప్రత్యేక సమావేశం వాయిదా.. కారణమేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.