ETV Bharat / business

జైకొవ్​-డి టీకా ఒక డోసు ధర రూ. 265 - జైడస్‌ క్యాడిలా సంస్థ

పిల్లల కోసం జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేసిన కరోనా టీకా జైకొవ్​-డి(Zycov-D Zydus Cadila) ఒక డోసు ధర రూ. 265గా నిర్ణయించింది ఆ సంస్థ. అయితే, సూది అవసరం లేకుండా ఇంజెక్టర్​ సాయంతో టీకా ఇవ్వనుంది. ఇంజెక్టర్​ ధర రూ.93 కలిపి.. జైకొవ్​-డి ఒక డోసు ధర రూ.358 అవుతుందని పేర్కొంది.

zydus cadila
జైకొవ్​-డి
author img

By

Published : Nov 9, 2021, 5:34 AM IST

జైడస్‌ క్యాడిలా రూపొందించిన కొవిడ్‌ టీకా జైకొవ్​-డి(Zycov-D Zydus Cadila) కోటి డోసుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్డర్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే, మూడు డోసుల్లో తీసుకోవాల్సిన ఈ టీకాను కేంద్ర ప్రభుత్వానికి ఒక డోసుకు రూ.265కు ఇచ్చేందుకు జైడస్‌ క్యాడిలా అంగీకరించినట్లు ఆ సంస్థ వెల్లడించింది.

అయితే, టీకా పంపిణీ కోసం సూది అవసరం లేకుండా ఇంజెక్టర్​ను వాడనున్నారు. దీని ధర రూ.93 కలుపుకొని (జీఎస్‌టీ కాకుండా) జైకొవ్​-డి(Zycov-D Zydus Cadila) ఒక డోసు ధర రూ.358 అవుతుందని పేర్కొంది. కేంద్రంతో సంప్రదించిన తర్వాతే ఈ ధరను నిర్ణయించినట్లు జైడస్‌ క్యాడిలా ఓ ప్రకటనలో తెలిపింది.

తొలి టీకాగా..

దేశంలో 12 ఏళ్ల వయసు పైబడిన పిల్లల కోసం అనుమతి పొందిన తొలి టీకాగా జైకొవ్​-డి నిలిచింది. అయితే, ఈ టీకాను మూడు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఒక్కో డోసు ఖరీదు రూ.265 కాగా.. ఇంజెక్టర్​కు రూ.93, 5శాతం జీఎస్‌టీ (రూ.18) అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా మూడు డోసులకు మొత్తంగా రూ.1128గా అవనున్నట్లు తెలుస్తోంది. అయితే, మూడు డోసుల్లో అందించే ఈ టీకాను తొలుత రూ.1900కు అందజేస్తామని జైడస్‌ క్యాడిలా ప్రతిపాదించింది.

ఇప్పటికే అందుబాటులో ఉన్న టీకాలతో పోలిస్తే జైడస్‌(Zycov-D Zydus Cadila) ధర ఎక్కువగా ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థతో సంప్రదింపులు జరిపింది. దీంతో చివరకు ఒక డోసును రూ.265కు ఇచ్చేందుకు జైడస్‌ అంగీకరించినట్లు సమాచారం. సూది లేకుండా వాడిపారేసే ఇంజెక్టర్​ను వినియోగించనున్నందున దాని ధర రూ.93 కలుపుకొని.. ఒక డోసుకు రూ.358 అవుతుంది.

ఇదిలాఉంటే, సూది అవసరం లేకుండా మూడు డోసుల్లో ఇచ్చే ఈ టీకాను 12ఏళ్ల వయసుపైబడిన వారికి ఇచ్చేందుకు ఆగస్టు 20వ తేదీనే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఒక్కో డోసును 28రోజుల వ్యవధి చొప్పున తీసుకోవాల్సి ఉంటుంది. గుజరాత్‌కు చెందిన జైడస్‌ క్యాడిలా రూపొందించిన ఈ టీకా.. ప్రపంచంలోనే అనుమతి పొందిన డీఎన్‌ఏ ఆధారిత తొలి కరోనా టీకాగా నిలిచింది.

ఇదీ చూడండి: కోటి జైకొవ్​-డి టీకాల కోసం కేంద్రం ఆర్డర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.