కేంద్ర ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగులకు అందించే ఫించన్లలో కోత విధించనున్నట్లు వచ్చిన వార్తలపై ఆర్థిక శాఖ స్పష్టతనిచ్చింది. పింఛన్లలో ఎలాంటి తగ్గింపు ఉండబోదని తేల్చిచెప్పింది.
పింఛన్లలో 20 శాతం కోత విధిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ ఈ మేరకు స్పందించింది. నగదు నిర్వహణపై ప్రభుత్వ సూచనలకు, పింఛన్లకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం 65.26 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పింఛనుదారులుగా ఉన్నారు.
" పింఛన్లు తగ్గించాలని ఎటువంటి ప్రతిపాదన చేయలేదు. ప్రభుత్వానికి కూడా అలాంటి ఆలోచన లేదు. పింఛనుదారుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది."
-కేంద్రం