ETV Bharat / business

రూ.50 లక్షల ప్రమాద బీమా ఎవరెవరికి?

దేశంలో కరోనా వైరస్​ విస్తరిస్తోంది. బాధితులకు సేవలందించే వైద్య సిబ్బంది, ఇతర ఆరోగ్య కార్యకర్తలకు కేంద్ర ప్రభుత్వం రూ. 50 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమాను ప్రకటించింది. దీనికి సంబంధించిన విధివిధానాలను ఆదివారం విడుదల చేసింది కేంద్రం.

centre gives Rs 50 lakh accident insurance for whom?
రూ.50 లక్షల ప్రమాద బీమా ఎవరెవరికి?
author img

By

Published : Mar 30, 2020, 6:23 AM IST

కరోనా వైరస్‌ సోకిన రోగులకు చికిత్స, సేవలందించే వైద్యులు, ప్రజారోగ్య పరిరక్షణ సిబ్బంది, సామాజిక ఆరోగ్య కార్యకర్తలకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వనున్న రూ.50 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమాపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ.. ఆదివారం విధివిధానాలను ప్రకటించింది. కరోనా రోగులకు సేవలందించే క్రమంలో ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోతే ఈ బీమా వర్తిస్తుంది. 90 రోజులపాటు బీమా సదుపాయం అమల్లో ఉంటుంది.

  • దేశవ్యాప్తంగా 22.12 లక్షల మందికి ఇది వర్తిస్తుంది.
  • వైద్యులు, వైద్య నిపుణులు, ఆశావర్కర్లు, పారామెడికల్‌ సిబ్బంది, నర్సులు, వార్డుబాయ్‌లు, పారిశుద్ధ్య కార్మికులు, రోగనిర్ధరణ పరీక్షలు నిర్వహించే సిబ్బంది, ఇతర ఆరోగ్య కార్యకర్తలు.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అన్ని ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య వికాస కేంద్రాలు, ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బందికి.
  • గతంలో ఎన్నడూ తలెత్తని పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది/ పదవీ విరమణ/ స్వచ్ఛంద/ పట్టణ స్థానిక సంస్థలు/ కాంట్రాక్టు/ దినకూలీ/ తాత్కాలిక/ పొరుగుసేవల సిబ్బంది/ రాష్ట్రాలు/ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని స్వయం ప్రతిపత్తి ఆసుపత్రులు, ఎయిమ్స్‌, ఐఎన్‌ఐలు, వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల పరిధిలో పని చేసే ఆసుపత్రులకు కరోనా సంబంధిత బాధ్యతలను అప్పగించొచ్చు. వీరెవరైనా కరోనా చికిత్స సంబంధిత సేవల్లో ఉంటే వారికి ఈ బీమా వర్తిస్తుంది.
  • ఆయా సిబ్బందికి ఇప్పటికే ఏవైనా బీమాలుంటే వాటికి అదనంగా ఈ బీమా వర్తిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.