ETV Bharat / business

ఎయిర్​ఇండియా అప్పులపై కేంద్రం కీలక నిర్ణయం!

author img

By

Published : Sep 19, 2020, 5:12 AM IST

నష్టాల్లో ఉన్న ఎయిర్​ఇండియాకు అప్పుల భారం తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎయిర్​ఇండియా కొనుగోలుకు ఇతర సంస్థలు ఆసక్తి చూపేలా ఈ ఆలోచన చేసినట్లు సమాచారం.

ఎయిర్​ఇండియా

నష్టాల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్​ఇండియా కొనుగోలుకు ఇతర సంస్థలు ఆసక్తి చూపేలా కేంద్రం మరో ఆలోచన చేస్తోంది. సంస్థకు ఉన్న అప్పుల భారం తగ్గించాలని యోచిస్తోంది. పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన గడువునూ మరికొంతకాలం పాటు పొడిగించాలని భావిస్తోంది.

2019 మార్చి 31 నాటికి ఎయిర్​ఇండియాకు రూ.58,255 కోట్ల మేర అప్పులు ఉన్నాయి. ఫలితంగా అదే ఏడాది రూ.29,464 కోట్ల సంస్థ అప్పులను.. ప్రభుత్వం యాజమాన్యంలో ఉన్న స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ ఎయిర్​ఇండియా అస్సెట్‌ హోల్డింగ్‌ కంపెనీ లిమిటెడ్‌కు బదిలీ చేసింది. కొవిడ్‌ నేపథ్యంలో ఏర్పడిన ప్రస్తుత ఆర్థిక స్థితిలో సంస్థను కొనుగోలు చేసేలా ఆకర్షించేందుకు అప్పుల భారం తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది అని ఓ అధికారి వెల్లడించారు. అలాగే బిడ్డింగ్‌ ప్రక్రియకు మరింత సమయం ఇవ్వాలని భావిస్తోందని మరో అధికారి తెలిపారు.

వాయిదా పడే అవకాశం..

ఇప్పటికే కంపెనీ విక్రయానికి సంబంధించి నాలుగుసార్లు బిడ్డింగ్‌ ప్రక్రియ వాయిదా పడింది. ఈ ఏడాది జనవరి 27న పూర్తిస్థాయిలో ప్రారంభమైన అమ్మకం ప్రక్రియ వాయిదా పడుతూ.. తాజాగా అక్టోబర్‌ 30కి చేరింది. ప్రభుత్వం తీసుకుబోయే తాజా నిర్ణయంతో బిడ్డింగ్‌ ప్రక్రియ మరింత కాలం వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి.

మరోవైపు కంపెనీ నష్టాలు అంతకంతకూ పెరుగుతున్నాయని పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరి తెలిపారు. గతేడాది తొలి త్రైమాసికంలో రూ.785 కోట్లుగా ఉన్న అప్పులు ఈ ఏడాది తొలి త్రైమాసికానికి రూ.2,570 కోట్లకు పెరిగినట్లు లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సంవత్సరం వెయ్యి కోట్ల రూపాయలు కంపెనీకి రుణంగా అందజేసినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: ఎయిర్​ ఇండియాకు టాటాల టేకాఫ్‌?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.