కంపెనీలన్నీ కుమ్మక్కై సిమెంటు ధరలను నియంత్రిస్తున్నాయన్న వాదనను దక్షిణ భారత సిమెంట్ తయారీదారుల సంఘం (ఎస్‌ఐసీఎంఏ) తోసిపుచ్చింది. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగిన మీడియా సమావేశంలో ఈమేరకు వివరణ ఇచ్చింది. బిల్డర్లకు సిమెంట్ తక్కువ ధరకే లభిస్తున్నట్లు ఎస్‌ఐసీఎంఏ పేర్కొంది.
సిమెంట్ ధరల పెంపును విమర్శిస్తోన్న బిల్డర్లకు మార్జిన్లు ఎక్కువగా ఉన్నాయని, సిమెంట్ కంపెనీల మార్జిన్లు తక్కువగా ఉన్నాయని ఎస్‌ఐసీఎంఏ అధ్యక్షుడు శ్రీనివాసన్ అన్నారు. సిమెంట్ ధరల పెరిగాయన్న నేపంతో బిల్డర్లు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆరోపించారు.
డిమాండ్ ఉంటేనే ఉత్పత్తి..
సిమెంట్‌ను ఎక్కువగా నిల్వ చేయలేమని.. డిమాండ్ ఉన్న మేరకు ఉత్పత్తి చేయాల్సి ఉంటుందని, అందుకే పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి కుదరటం లేదని స్పష్టం చేశారు శ్రీనివాసన్. కాలుష్య నియంత్రణ మండలి అనుమతించిన మేరకే ఉత్పత్తి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
భారత సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం 20 మిలియన్ టన్నుల నుంచి 500 మిలియన్ డాలర్ల సామర్థ్యానికి చేరుకుందని తెలిపారు.
ఇదీ చూడండి:గృహ మార్కెట్లో పెరుగుతున్న గిరాకీ