ETV Bharat / business

చెరకుపై కనీస మద్దతు ధరను పెంచిన కేంద్రం - CCEA approves increase in sugarcane FRP by Rs 10

చెరకు రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కనీస మద్దతు ధరపై రూ. 10 పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలు ఈ ఏడాది అక్టోబర్​ నుంచి అమల్లోకి రానున్నాయి.

CCEA approves increase in sugarcane FRP by Rs 10 to Rs 285/qtil for 2020-21: Sources
చెరకుపై కనీస మద్దతు ధరను పెంచిన కేంద్రం
author img

By

Published : Aug 19, 2020, 3:46 PM IST

చెరకు సాగుదారులకు ఊరట కలిగిస్తూ కనీస మద్దతు ధర(ఎఫ్​ఆర్​పీ)పై రూ.10 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం క్వింటాల్​ చెరకుకు రూ. 275 కనీస మద్దతు ధర చెల్లిస్తుండగా.. పెంచిన ధరతో ఆ మొత్తం రూ. 285కు చేరింది.

ఈ ఏడాది అక్టోబర్​లో ప్రారంభంకానున్న చెరకు కొనుగోలు సీజన్​ నుంచి ఈ ధరలు అమల్లోకి రానున్నాయి. 2020-21 మార్కెటింగ్​ ఏడాదికి చెరకు కనీస మద్దతు ధరను పెంచడంపై ఆర్థిక వ్యవహారాల కేబినెట్​ కమిటీ(సీసీఈఏ) నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఈ మేరకు చెరకు మద్దతు ధరను క్వింటాల్​కు రూ.10 పెంచాలన్న ఆహార మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను సీసీఈఏ ఆమోదముద్ర వేసిందని అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: పోలీసుల వేషంలో ఇంటికి వచ్చి ఘరానా దోపిడీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.