దేశ భద్రత దృష్ట్యా టెలికం రంగంపై 'నేషనల్ సెక్యూరిటీ డైరెక్టివ్'ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం బుధవారం నిర్ణయం తీసుకుంది. దీంతో చైనా నుంచి దిగుమతి చేసుకునే టెలికాం వస్తువులకు అడ్డుకట్ట పడనుంది.
'నమ్మకమైన వర్గాల' నుంచి మాత్రమే దేశంలోని నెట్‌వర్క్ సంస్ధలు తమకు అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను మంత్రివర్గం ఈ మేరకు ఆమోదించింది. దీనిప్రకారం ఆయా కొనుగోళ్లకు సంబంధించి విశ్వసనీయ ఉత్పత్తులు, కంపెనీల జాబితాను కేంద్రం త్వరలో ప్రకటించనుంది.
ఏ ఉత్పత్తులను కొనుగోలు చేయాలన్న అంశాన్నినేషనల్ సైబర్ భద్రత సమన్వయ సంఘం ఆధ్వర్యంలోని కమిటీ నిర్ణయిస్తుంది. ఏ కంపెనీల నుంచి కొనుగోళ్లు జరపరాదన్న జాబితాను కూడా కేంద్రం విడుదల చేయనుంది. ప్రస్తుత సామాగ్రిని తప్పనిసరిగా మార్చుకోవాలని భావిస్తే ఈ నిబంధనలు వర్తించవు. మాల్‌వేర్ ఉంటుందన్న కారణంగా చైనా నుంచి టెలికాం, విద్యుత్ రంగ సామాగ్రి దిగుమతులపై గత నెలలోనే కేంద్రం నిషేధం విధించింది.
ఇదీ చదవండి:4 షరతుల పూర్తికి మరో రెండు నెలల గడువు