ఎలక్ట్రానిక్ సిగరెట్లపై పూర్తి స్థాయి నిషేధానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. యువత సంక్షేమం, ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయమై ప్రకటన చేశారు.
"ఈ-సిగరెట్లపై నిషేధానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉత్పత్తి, తయారీ, ఎగుమతులు, దిగుమతులు, రవాణా, క్రయవిక్రయాలు, నిల్వ, ప్రచారం.. ఇలా అన్నింటిపైనా నిషేధం కొనసాగుతుంది. ఈ-సిగరెట్లు అలవాటు మంచిదని కొంతమంది భావిస్తున్నారు. దేశంలో సుమారు 400 బ్రాండ్లు ఉన్నాయి. 150 రకాల ఫ్లేవర్లలో దొరుకుతున్నాయి. కానీ ఏ ఒక్కటి భారత్‌లో తయారైంది కాదు. "
-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
- ఈ- సిగరెట్ తయారీ, విక్రయం, దిగుమతి, నిల్వ అన్నింటిపైనా దేశంలో నిషేధం.
- ఈ- సిగరెట్ వల్ల యువతపై చెడు ప్రభావం పడుతోంది.
- ఈ- సిగరెట్ వల్ల అమెరికాలో చాలా దుష్ప్రభావాలు వచ్చాయి.
- అమెరికా అనుభవాలు దృష్టిలో పెట్టుకుని మన దేశంలో కూడా నిషేధిస్తున్నాం.
- అదే సమయంలో సాధారణ సిగరెట్‌ను కూడా ప్రోత్సహించడం లేదు.
- పొగాకు వాడకాన్ని తగ్గించాలనేదే ప్రభుత్వ ఆశయం.
- ఇప్పుడు మార్కెట్‌లో ఉన్న ఈ- సిగరెట్ల తయారీ భారత్‌లో జరిగింది కాదు .
- మన దేశంలో అక్రమంగా తయారైన వందకు పైగా రకాలు ఈ- సిగరెట్ల విక్రయం జరుగుతోంది.
- ఈ- సిగరెట్ ప్రచారంపై కూడా నిషేధం విధిస్తున్నాం.
ఇదీ చూడండి: మందగమనంపై ప్రియాంక 'హౌదీ-మోదీ' పంచ్