ETV Bharat / business

మార్కెట్లు హై జంప్​- సెన్సెక్స్ 2,315 ప్లస్​ - సెన్సెక్స్

బడ్జెట్​ 2021-22 ఇచ్చిన ఉత్సాహంతో స్టాక్ మార్కెట్లు సోమవారం హై జంప్ చేశాయి. సెన్సెక్స్ ఏకంగా 2,315 పాయింట్ల లాభంతో 48,600 మార్క్​ అందుకుంది. నిఫ్టీ 647 పాయింట్లు పెరిగి 14,300లకు చేరువైంది.

Market high jump
బడ్జెట్​ ఉత్సాహంతో మార్కెట్లు హై జంప్
author img

By

Published : Feb 1, 2021, 3:42 PM IST

Updated : Feb 1, 2021, 6:47 PM IST

స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరు రోజుల నష్టాలకు చెక్​ పెడుతూ సోమవారం రికార్డు స్థాయిలో పుంజుకున్నాయి. బడ్జెట్ అందించిన ఉత్సాహంతో బీఎస్​ఈ-సెన్సెక్స్​ 2,315 పాయింట్లు పెరిగి.. 48,600 వద్దకు చేరింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 647 పాయింట్ల లాభంతో తిరిగి 14,281 వద్ద స్థిరపడింది.

బ్యాంకింగ్ షేర్లు అత్యధికంగా లాభాలను గడించాయి.

  • ఇండస్​ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్​, బజాజ్ ఫిన్​సర్వ్​, ఎస్​బీఐ, ఎల్​&టీ, హెచ్​డీఎఫ్​బీ
  • డాక్టర్ రెడ్డీస్​, టెక్ మహీంద్రా, హెచ్​యూఎల్​ మాత్రమే 30 షేర్ల ఇండెక్స్​లో నష్టాలతో ముగిశాయి.

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు అయిన.. షాంఘై, నిక్కీ, కోస్పీ, హాంగ్​సెంగ్ సూచీలు భారీగా లాభాలను గడించాయి.

మదుపరుల సంపద భారీ వృద్ధి..

స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో దూసుకెళ్లిన నేపథ్యంలో.. బీఎస్​ఈ లిస్టెడ్ కంపెనీల మదుపరుల సంపద రూ.6.34 లక్షల కోట్లు పెరిగింది.

Last Updated : Feb 1, 2021, 6:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.