ETV Bharat / business

పద్దు 2020: గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కించేనా?

దేశార్థిక పరిస్థితులు ఏమంత మెరుగ్గా లేవు. మందగమనం వెంటాడుతోంది. సంస్కరణలెన్ని చేపట్టినా ఫలితం అంతంతమాత్రమే. ఈ దశలో ఎన్డీఏ 2.0 ప్రభుత్వం ప్రవేశపెడుతున్న తొలి పూర్తి స్థాయి బడ్జెట్​పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సార్వత్రిక ఎన్నికల అనంతరం.. రాష్ట్రాల ఎన్నికల్లో డీలా పడిపోయిన భాజపాకు ఈ పద్దు ఎంతో కీలకం. అయితే.. మందగమనం నేపథ్యంలో ప్రజాకర్షణ మంత్రం జపించేందుకు అసలు అవకాశముందా? ఎలాంటి సంస్కరణలు చేపట్టొచ్చు..? బడ్జెట్​ 2020 అంచనాలపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

BUDGET 2020
పద్దు 2020: గడ్డు పరిస్థితుల నుంచి.. గట్టెక్కేనా?
author img

By

Published : Jan 21, 2020, 6:34 PM IST

Updated : Feb 17, 2020, 9:30 PM IST

బడ్జెట్​... ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం తెచ్చే వార్షిక ఖర్చు, జమ వివరాల పత్రం. దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే సత్తా ఉన్న ఈ పద్దు​పై సాధారణంగానే ప్రజల దృష్టి ఉంటుంది. కానీ ఈ సారి బడ్జెట్​కు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్డీఏ 2.0 ప్రవేశపెడుతోన్న మొదటి పూర్తిస్థాయి బడ్జెట్​తో పాటు... ప్రస్తుతమున్న ఉన్న రాజకీయ, ఆర్థిక స్థితిగతులే ఇందుకు కారణం. వరుసగా రాష్ట్రాల్లో అధికారం కోల్పోతున్న మోదీ సర్కారుకు ఈ బడ్జెట్ మరీ ముఖ్యం.

రాష్ట్రాలు కీలకం..

2019 సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు స్థానాలను గెలుచుకొని తిరిగి అధికారాన్ని కైవసం చేసుకుంది భారతీయ జనతా పార్టీ. లోక్​సభ సమరంలో సత్తా చాటిన కాషాయ పార్టీ ప్రాభవం క్రమంగా తగ్గుతూవచ్చింది. సార్వత్రికం అనంతరం జరిగిన రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో డీలాపడింది. హరియాణా, మహారాష్ట్ర, ఝార్ఖండ్​లలో ఎన్నికలు జరగగా... ఇందులో కేవలం హరియాణాలోనే అధికారాన్ని కాపాడుకోగలిగింది. అదీ ఇతర పక్షాల మద్దతుతో. ఇదే స్పష్టం చేస్తోంది ప్రజలను ఆకర్షించడానికి ఈ పద్దు ఎంత కీలకమో.

ఫిబ్రవరిలో దిల్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఏడాది చివర్లో బిహార్ అసెంబ్లీకి పోలింగ్​. వరుసగా రాష్ట్రాల్లో అధికారం కోల్పోతున్న భాజపాకు ఈ ఎన్నికలు ఎంతో ముఖ్యం. ఇప్పటికే పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్​సీ, ఎన్​పీఆర్​ లాంటి వాటిపై దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజలు ఇలా పలు వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అన్నింటినీ అధిగమిస్తూ రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో ప్రజలను ఆకర్షించేలా బడ్జెట్​లో ప్రభుత్వం చర్యలు తీసుకునే అవసరం ఉంది.

ఆర్థిక వ్యసస్థకు ఊతమిస్తారా?

దేశ ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదు. ప్రస్తుత సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 2012-13 తర్వాత.. అత్యల్పంగా నమోదు అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనితో పాటు ఇటీవల ద్రవ్యోల్బణం కూడా ఐదేళ్ల గరిష్ఠాన్ని చేరింది. ప్రజల కొనుగోళ్లు తగ్గినందువల్ల పడిపోయిన వినియోగ డిమాండ్ ఇంకా గాడిలో పడలేదు. వీటితో పాటు అనేక ఇతర కారణాలతో.. జీడీపీ వృద్ధి క్షీణిస్తోంది.

సార్వత్రిక పోరు అనంతరం లోక్​సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్​ ప్రవేశపెట్టారు. అప్పటికే ఆర్థిక వ్యవస్థ మందగమనం ప్రారంభమైంది. ఆ బడ్జెట్​లో దేశార్థికాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేయలేదనే విమర్శలు వినిపించాయి. వీటన్నింటికీ బదులిస్తూ కేంద్రం ఇటీవల కొన్ని సంస్కరణలు చేపట్టింది. సెప్టెంబర్​లో కార్పొరేట్ పన్ను తగ్గించటం ఇందులో ప్రధానమైంది. దీనితో పాటు రూ. 102 లక్షల కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పన, రుణ లభ్యతను పెంచటం సహా స్థిరాస్తి రంగాలకు సంబంధించి వివిధ చర్యలు తీసుకుంది.

మళ్లీ సంస్కరణల జపం..!

ప్రస్తుతం పూర్తిస్థాయి బడ్జెట్​ను ప్రవేశపెడుతోన్న దృష్ట్యా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు సర్కారు మరిన్ని చర్యలు తీసుకుంటుందని నిపుణులు ఆశిస్తున్నారు. ప్రజలకు ఖర్చు పెట్టేందుకు అందుబాటులో ఉండే డబ్బును పెంచటం ద్వారా ఆర్థిక వ్యవస్థను ఊతమివ్వొచ్చు. ఇందుకోసం ఆదాయపు పన్నును తగ్గిస్తారని అందరూ భావిస్తున్నారు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

గ్రామీణ వినియోగ డిమాండ్ ప్రస్తుతం పడిపోయింది. మళ్లీ గాడిలో పెట్టేందుకు ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పినను పెంచేందుకు బడ్జెట్​లో భారీ స్థాయిలో నిధులు కేటాయిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈక్విటీలపై పన్ను.. కేంద్రం మాటేంటి?

స్టాక్​మార్కెట్లలో పెట్టుబడిదారులపై వసూలు చేసే దీర్ఘకాల మూలధన లాభాలపై కూడా కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈక్విటీలపై పన్నును.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రేట్ల స్థాయికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మోదీ ఇప్పటికే ప్రకటించారు. దీనితో పాటు డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్ పన్నుకు సంబంధించి కూడా ఈ పద్దులో చర్యలు తీసుకుంటారని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి: పద్దు: ప్రకటనలు ఎన్నెన్నో.. అమలైనవి కొన్నే

ZCZC
PRI GEN NAT
.NEWDELHI DEL53
CBI-DGFT
CBI books former DGFT officer, others in Rs 20 cr duty fraud
         New Delhi, Jan 21 (PTI) The CBI has filed a corruption case against a former Directorate General of Foreign Trade joint director along with directors of a private company for allegedly cheating the exchequer of nearly Rs 20.26 crore through fraudulent claim of terminal excise duty in 2014-15, officials said on Tuesday.
         They said the action has been taken against A K Singh, the former DGFT joint director, Ahmedabad and Mohit Kumar Goel, Ankur Aggarwal and Nand Kishore Aggarwal -- all directors of city-based Crystal Crop Protection.
         The CBI had sought sanction from the Commerce Ministry before proceeding against the officer, the officials said.
         The sanction was granted by the ministry on July 15, 2019, they said. PTI ABS ABS
DIV
DIV
01211635
NNNN
Last Updated : Feb 17, 2020, 9:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.