ETV Bharat / business

'డిపాజిటర్ల సొమ్ము భద్రం- బీమా కవరేజీ 5 లక్షలకు పెంపు' - బడ్జెట్ 2020 ముఖ్యాంశాలు

బ్యాంకింగ్ వ్యవస్థను పటిష్ఠం చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు.. మొండి బకాయిలును తిరిగి రాబట్టుకునేందుకు పలు సవరణలు ప్రకటించారు. గత కొన్నేళ్లలో ప్రభుత్వం బ్యాంకులకు రూ.3 లక్షల 50 వేల కోట్ల మూలధన సాయం చేసినట్లు వెల్లడించారు. డిపాజిటర్ల రుణ పరిమితిని 5 లక్షలకు పెంచనున్నట్లు స్పష్టం చేశారు

budget 2020 banking
డిపాజిటర్ల సొమ్ము సురక్షితం- బీమా కవరేజీ 5 లక్షలకు పెంపు
author img

By

Published : Feb 1, 2020, 2:19 PM IST

Updated : Feb 28, 2020, 6:47 PM IST

'డిపాజిటర్ల సొమ్ము సురక్షితం- బీమా కవరేజీ 5 లక్షలకు పెంపు'

స్వచ్ఛమైన, నమ్మకమైన, బలమైన రంగాలు ఆర్థిక వ్యవస్థకు అత్యావశ్యకమని అన్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఐదు ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాకారం అయ్యేందుకు ఆర్థిక నిర్మాణాలు కలిసి ముందుకు సాగాలని చెప్పారు. మొండి బకాయిలతో సతమతమవుతోన్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ(ఎన్​బీఎఫ్​సీ)లు కోలుకునేందుకు పలు సవరణలు ప్రకటించారు. గత కొన్నేళ్లలో బ్యాంకులకు ప్రభుత్వం రూ.3 లక్షల 50 వేల కోట్ల మూలధన సాయం చేసినట్లు వెల్లడించారు.

"గత కొన్నేళ్లలో ప్రభుత్వం బ్యాంకులకు 3 లక్షల 50 వేల కోట్ల మూలధన సాయం చేసింది. ఈ బ్యాంకుల్లో ప్రభుత్వ సంస్కరణలు అమలు చేయడం ద్వారా అవి మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి. అదనపు మూలధనం కోసం మూలధన మార్కెట్​ను ఆశ్రయించేందుకూ ఆ బ్యాంకులను ప్రోత్సహిస్తున్నాం. అన్ని షెడ్యూల్ వాణిజ్య బ్యాంకుల సంరక్షణ కోసం బలమైన చర్యలు చేపడుతున్నాం. డిపాజిటర్ల సొమ్ము అత్యంత సురక్షితంగా ఉంటుంది. డిపాజిటర్ల బీమా కవరేజీని రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నాం. సర్ఫేసీ చట్టం-2002 ప్రకారం ఎన్​బీఎఫ్​సీల రుణాలు తిరిగి రాబట్టుకునేందుకు పరిమితిని 500 కోట్ల నుంచి 100 కోట్లకు తగ్గించేందుకు ప్రతిపాదిస్తున్నాం. కోటి రూపాయల రుణ పరిమితిని 50 లక్షలకు తగ్గిస్తున్నాం. తద్వారా తక్కువ మొత్తంలోని రుణాలను సైతం సులభంగా తిరిగి రాబట్టుకునే అవకాశం ఉంటుంది."

-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థికమంత్రి

కో-ఆపరేటివ్ బ్యాంకులను బలోపేతం చేయడానికి బ్యాంకింగ్ రెగ్యులేషన్​ చట్టానికి సవరణ చేయనున్నట్లు తెలిపారు నిర్మలా. ప్రొఫెషనలిజం, పెట్టుబడులను ఆకర్షించడం, సమర్థమైన నిర్వహణ కోసం ఈ సవరణ ప్రతిపాదిస్తున్నట్లు స్పష్టం చేశారు. గత కొన్నేళ్లలో బ్యాంకింగ్​ వ్యవస్థను పటిష్ఠం చేయడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసిందన్నారు. అయితే ఈ రంగంలో ప్రైవేట్​ పెట్టుబడులు పెరగాల్సిన ఆవశ్యకత ఉందని నొక్కిచెప్పారు. ఐడీబీఐ బ్యాంకును సంస్థాగత మదుపర్ల పెట్టుబడి కోసం స్టాక్​ ఎక్స్ఛేంజీలో నమోదు చేసి వాటాలు విక్రయించనున్నట్లు ప్రకటించారు.

Last Updated : Feb 28, 2020, 6:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.