BSNL Fiber Broadband Plan: గత కొద్ది నెలల నుంచి భారత సంచార్ నిగమ్ లిమిటెట్ (బీఎస్ఎన్ఎల్) తన సేవలను మరింత విస్తృతం చేస్తుంది. ఇతర టెలికాం సర్వీసులతో పోల్చితే తక్కువ ధరకే సేవలు అందిస్తూ.. సంస్థను కొత్త పుంతలు తొక్కిస్తోంది. తాజాగా కేవలం రూ. 329 లకే కొత్త ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను తీసుకు వచ్చింది. భారత్ ఫైబర్ సర్వీసుల కింద ఈ ఫైబర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు ఉన్న రూ.449 ప్లాన్‌ను మరింత తగ్గించి అందరికీ అందుబాటులో ఉండేలా దీనిని రూపొందించింది. అయితే సేవలు కేవలం ఎంపిక చేసిన రాష్ట్రాలకు మాత్రమే వర్తిస్తాయని తెలిపింది. ఈ ప్లాన్ కింద మీరు లబ్ధి పొందుతున్నారో లేదో తెలుసుకోవాలి అంటే బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్స్ వెబ్ పేజ్‌ను చూడాలని చెప్పింది.
ఈ ప్లాన్ ప్రయోజనాలు ఇవే...!
- ఇంటర్నెట్ స్పీడ్- 20 ఎంబీపీఎస్
- 1000 జీబీ(1 టీబీ)
- అన్లిమిటెడ్ కాలింగ్‌తో ల్యాండ్‌లైన్ ఫోన్ ఉచితం
- తొలి నెల బిల్లుపై 90 శాతం వరకు డిస్కౌంట్
అయితే గతంలో ఉన్న రూ. 449 ప్లాన్‌తో పోల్చితే దీనిలో ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉంది. ముందున్న ప్లాన్‌లో 30 ఎంబీపీఎస్ ఉంటే .. రూ. 329 ప్లాన్‌లో మాత్రం 20 ఎంబీపీఎస్ మాత్రమే ఉంది. దీనితో పాటు డేటా కూడా తక్కువగా ఉంది.
ఇదీ చూడండి: