కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ భారత ఔషధ సంస్థ భారత్ బయోటెక్‌తో బ్రెజిల్ కీలక ఒప్పందం చేసుకుంది. భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కొవాగ్జిన్ టీకా 2కోట్ల డోసుల కొనుగోలుకు అంగీకారం కుదుర్చుకుంది. బ్రెజిల్‌లో కరోనా మరణాలు 2లక్షల 50వేలకు చేరిన రోజే ఈ ఒప్పందం కుదుర్చుకోగా.. ఇందుకు ఆ దేశ నియంత్రణ సంస్థలు అంగీకరించాల్సి ఉంది.
ఒప్పందం చేసుకున్న వాటిలో మొదటి 8 మిలియన్ కొవాగ్జిన్ డోసులను బ్రెజిల్ ఔషధ కంపెనీ ప్రెసిసా మెడికామెంటోస్ అందించనున్నట్లు అధ్యక్షుడు జైర్ బోల్సొనారో పేర్కొన్నారు. అవి మార్చిలో వచ్చే అవకాశముందని అంచనా వేశారు. మరో 80 లక్షల డోసులు ఏప్రిల్-మే మధ్య అందుబాటులోకి రావొచ్చని అభిప్రాయపడ్డారు. అటు బ్రెజిల్‌లో రోజువారీ కేసులు భారీగా నమోదవుతుంటే టీకా పంపిణీ ప్రక్రియ మాత్రం చురుగ్గా సాగటం లేదు. ఇప్పటి వరకు 4శాతం మంది ప్రజలకు మాత్రమే కొవిడ్ టీకాలు అందించారు.
ఇదీ చదవండి : చైనా దుష్ప్రచారం కట్టడికి అమెరికా సభలో బిల్లు