ETV Bharat / business

BMW IX Electric SUV: బీఎమ్‌డబ్ల్యూ నుంచి విద్యుత్‌ ఎస్‌యూవీ

BMW IX Electric SUV: బీఎమ్‌డబ్ల్యూ మరో కొత్త మోడల్​ ఎస్​యూవీతో భారత్​లోకి వచ్చేసింది. పూర్తి స్థాయి విద్యుత్‌ స్పోర్ట్స్‌ వినియోగ వాహనం (ఎస్‌యూవీ) 'ఐఎక్స్‌'ని ఆవిష్కరించింది. ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.1.16 కోట్లు.

bmw ix electric suv
బీఎమ్‌డబ్ల్యూ ఐఎక్స్‌
author img

By

Published : Dec 14, 2021, 8:51 AM IST

BMW IX Electric SUV: జర్మనీ వాహన తయారీ దిగ్గజం బీఎమ్‌డబ్ల్యూ పూర్తి స్థాయి విద్యుత్‌ స్పోర్ట్స్‌ వినియోగ వాహనం (ఎస్‌యూవీ) 'ఐఎక్స్‌'ను భారత్‌లో ఆవిష్కరించింది. రాబోయే 6 నెలల్లో మన దేశంలోకి విడుదల చేయబోయే మూడు విద్యుత్‌ వాహనాల్లో ఇది మొదటిది. ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.1.16 కోట్లు. పూర్తి స్థాయిలో సిద్ధం చేసిన వాహనం(సీబీయూ)గా ఈ కారును దిగుమతి చేసుకుంటారు. బీఎమ్‌డబ్ల్యూ డీలర్‌షిప్‌లలో లేదా కంపెనీ వెబ్‌సైట్‌ ద్వారా వీటిని బుక్‌ చేసుకోవచ్చని, 2022 ఏప్రిల్‌ నుంచి డెలివరీలు మొదలవుతాయని సంస్థ తెలిపింది.

BMW IX SUV Specifications:

  • ఆల్‌ వీల్‌ డ్రైవ్‌ వాహనం(ఎస్‌ఏవీ-స్పోర్ట్స్‌ యాక్టివిటీ వెహికల్‌)గా ఇది వస్తోంది. రెండు విద్యుత్తు మోటార్‌లతో నడిచే ఈ కారు 6.1 సెకన్లలోనే 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.
  • ప్రారంభ ఆఫర్‌ కింద స్మార్ట్‌ బీఎమ్‌డబ్ల్యూ వాల్‌బాక్స్‌ ఛార్జర్‌ ఉచితంగా ఇస్తున్నారు. 11కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్‌తో ఇంటిదగ్గర 7 గంటల్లో పూర్తి ఛార్జింగ్‌ అవుతుంది. 2.5 గంటల ఛార్జింగ్‌తో 100 కి.మీ. వరకు ప్రయాణించవచ్చు.
  • 150 కి.వా. డీసీ ఛార్జర్‌ ద్వారా 31 నిమిషాల్లోనే 80 శాతం ఛార్జి అవుతుంది. 10 నిమిషాల్లో 95 కి.మీ. ప్రయాణించవచ్చు.
  • 50 కి.వా. డీసీ ఛార్జర్‌ ద్వారా 80 శాతం ఛార్జింగ్‌కు 73 నిమషాలు; 100 కి.మీ.ప్రయాణానికి 21 నిమిషాల సమయం అవుతుంది.
  • దేశంలోని 35 నగరాల్లో తన డీలర్‌ నెట్‌వర్క్‌ వద్ద ఫాస్ట్‌ ఛార్జర్లను ఇన్‌స్టాల్‌ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

వారంటీ ఇదీ..: కిలోమీటర్లతో సంబంధం లేకుండా కారుకు రెండేళ్ల వరకు వారెంటీ ఇస్తారు. ఎనిమిదేళ్లు లేదా 1.6 లక్షల కి.మీ. వరకు బ్యాటరీలకు వారెంటీ ఇస్తారు.

ఇదీ చదవండి:Infinix Note 11: తక్కువ ధరకు అదిరే ఫీచర్లతో కొత్త ఫోన్లు

ఫోక్స్​వ్యాగన్ న్యూ టైగూన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.