ETV Bharat / business

కొత్త మోడళ్ల రాకతో ఈ నెల బైక్​ లవర్స్​కు పండగే!

బైక్​ లవర్స్​కు ఏప్రిల్ మంచి కిక్కివ్వనుంది. ఈ నెలలో సుజుకీ, ట్రయంఫ్ సహా ప్రముఖ కంపెనీలు తమ కొత్త మోడళ్లను భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నాయి. మరి ఈ నెలలో రానున్న కొత్త బైక్​లు ఏవి? వాటి ధర, ఇతర విశేషాలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దం పదండి.

Bikes and scooters to launch in India in April
యువతకు కిక్కు ఇచ్చే బైక్​లు.. ఏప్రిల్​లో!
author img

By

Published : Apr 4, 2021, 6:44 PM IST

Updated : Apr 4, 2021, 6:59 PM IST

ఈ నెలలో ప్రముఖ బైక్​ కంపెనీలన్నీ భారత మార్కెట్​లోకి కొత్త మోడళ్లను విడుదల చేయనున్నాయి. వీటిలో కొన్ని ప్రీమియం బైక్​లు, మరికొన్ని బడ్జెట్​ ధరలో రానున్నాయి. సుజుకీ, ట్రయాంప్‌, డుకాటీ లాంటి కంపెనీలు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. ఆయా కంపెనీలు విడుదల చేయనున్న బైక్​ల విశేషాలు పరిశీలిద్ధాం.

ట్రయంఫ్​​ కొత్త బైక్​తో గట్టి పోటీ..

బ్రిటన్​కు చెందిన ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ ట్రయంఫ్.. ట్రైడెంట్ 660 పేరుతో ఏప్రిల్ 6 ఓ కొత్త బైక్​ను తీసుకురానుంది. ఈ మోడల్ ధర రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షల మధ్య ఉండొచ్చని అంచనాలున్నాయి.

కవాసకి జెడ్ 650, హోండా సీబీ 650ఆర్​కు.. ట్రైడెంట్ 660 గట్టి పోటీనిస్తుందని ట్రయంఫ్​ భావిస్తోంది. ఈ కొత్త బైక్​కు సంబంధించి ఇప్పటికే ప్రీ బుకింగ్స్ ప్రారంభించింది ట్రయంఫ్​.

Bikes and scooters to launch in India in April
ట్రయంఫ్ ట్రైడెంట్ 660

ప్రత్యేకతలు..

  • 660 సీసీ ఇంజిన్​
  • రైడింగ్​ మోడల్​ బైక్​
  • స్విచ​బుల్​ ట్రాక్షన్ కంట్రోల్
  • బ్లూటూత్ మాడ్యూల్‌తో పాటు టీఎఫ్‌టీ స్క్రీన్‌

2021 సుజుకీ హాయాబుసా..

జపాన్​కు చెందిన ఆటోమొబైల్​ కంపెనీ సుజుకీ 'హయాబుసా 2021'ను త్వరలో విడుదల చేయనుంది. విడుదల పై సంస్థ ఇప్పటికే అధికారిక ప్రకటన చేసినా.. తేదీని కచ్చితంగా చెప్పలేదు. భారత మార్కెట్​లో దీని ప్రారంభ ధర సుమారు రూ. 15 లక్షలు ఉండొచ్చని సమాచారం.

2021 సుజుకీ హాయాబుసా

ప్రత్యేకతలు..

  • 1340 సీసీ ఇంజిన్​
  • ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్
  • టీఎఫ్​టీ డిస్​ప్లే
  • త్రీ లెవల్​ ఆఫ్​ ఇంజన్​ బ్రేక్​ కంట్రోల్​

ఏప్రిలియా ఎస్​ఎక్స్​ఆర్​ 125

ప్రముఖ ఆటో మొబైల్​ దిగ్గజం పియాజియో ఇండియా మరో కొత్త స్కూటర్​ను భారత మార్కెట్​లోకి తీసుకురానుంది. ఇటీవల తీసుకువచ్చిన 'ఏప్రిలియా ఎస్​ఎక్స్​ఆర్​ 160'కు బడ్జెట్​ వెర్షన్​గా ఎస్​ఎక్స్​ఆర్​ 125ని విడుదల చేయనుంది. ఈ స్కూటర్​కు ఇప్పటికే ప్రీ బుకింగ్స్​ ప్రారంభించింది.

  • వ్రాప్​ ఎల్​ఈడీ హెడ్​ లైట్స్​
  • ఎల్​ఈటీ టైల్​ లైట్స్​
  • కంఫర్టబుల్​ సీటింగ్
  • ఫుల్​ డిజిటల్​ క్లస్టర్​

న్యూ టీవీఎస్​ అపాచీ ఆర్​ఆర్​310

దేశీయ స్పోర్ట్స్​ బైక్​లలో మంచి ఆదరణ పొందుతున్న అపాచీ మోడల్స్​లో టాప్​ఎండ్​ బైక్​ను తీసుకురానుంది టీవీఎస్​ మోటార్. న్యూ టీవీఎస్​ అపాచీ ఆర్ఆర్​ 310 పేరుతో ఏప్రిల్ 8న ఈ కొత్త మోడల్​ మార్కెట్​లోకి రానుంది. దీని ధర రూ. 2.5 లక్షలుగా ఉండొచ్చని అంచనా.

  • లో స్పీడ్​ రైడింగ్​ కోసం గ్లైడ్​ త్రూ టెక్నాలజీ
  • డ్యూయల్​ ఛానెల్​ ఏబీఎస్​
  • 5 అంగుళాల కలర్ డిస్​ప్లే

డుకాటీ డయావెల్, ఎక్స్‌డయావెల్

ఈ ఏడాది మొదటి త్రైమాసికం ముగిసేలోపు కొత్త మోడల్​ను విడుదల చేయనున్నట్లు డుకాటీ ఇండియా ఇప్పటికే ప్రకటించింది. ఇటీవలే మొదటి త్రైమాసికం ముగిసిన నేపథ్యంలో.. త్వరలోనే కొత్త బైక్​ విడుదయ్యే అవకాశం ఉంది. ఆటో మొబైల్ వర్గాల ప్రకారం.. డయావెల్​, ఎక్స్​డయావెల్ ఈ నెలలో రావచ్చు. ​ వీటి ధర సుమారు రూ. 16 లక్షల వరకు ఉండొచ్చు.

  • లిక్విడ్​ కూలింగ్ సిస్టమ్​
  • ఎలక్ట్రానికి ఫూయల్​ ఇంజెక్షన్​
  • కీ లెస్​ ఇగ్నీషన్​

ఇదీ చూడండి: పియాజియో నుంచి బడ్జెట్​ స్కూటీ

Last Updated : Apr 4, 2021, 6:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.