ETV Bharat / business

Bharti Airtel Q3 results: 2.8 శాతం తగ్గిన ఎయిర్‌టెల్‌ లాభం

Bharti Airtel Q3 results: మూడో త్రైమాసికంలో భారతీ ఎయిర్‌టెల్‌ ఏకీకృత నికర లాభం రూ.830 కోట్లకు చేరుకుంది. కానీ గతేడాది ఇదే క్వార్టర్​తో పోల్చితే 2.8 శాతం మేర నష్టం వచ్చినట్లు సంస్థ తెలిపింది.

Airtel
భారతీ ఎయిర్ టెల్
author img

By

Published : Feb 9, 2022, 6:52 AM IST

Bharti Airtel Q3 results: డిసెంబరు త్రైమాసికంలో భారతీ ఎయిర్‌టెల్‌ ఏకీకృత నికర లాభం రూ.830 కోట్లకు చేరుకుంది. 2020-21 ఇదే కాలంలో నమోదైన లాభం రూ.854 కోట్లతో పోలిస్తే, ఈసారి 2.8 శాతం తగ్గింది. ఇదే సమయంలో ఏకీకృత ఆదాయం మాత్రం రూ.26,518 కోట్ల నుంచి 12.6 శాతం వృద్ధితో రూ.29,867 కోట్లకు పెరిగింది. 'డిసెంబరు త్రైమాసికంలో పరిశ్రమలోనే అత్యధికంగా సగటు వినియోగదారు ఆదాయం(ఆర్పు) రూ.163ను నమోదు చేశాం. ఏడాది క్రితం ఇది రూ.166గా ఉంది. ఇటీవల టారిఫ్‌లను సవరించినా, వీటి పూర్తి ప్రభావం జనవరి-మార్చిలో కనిపిస్తుంది. ఎంటర్‌ప్రైజ్‌, హోమ్స్‌, ఆఫ్రికా వ్యాపారాలు బలంగా నమోదయ్యాయ'ని భారతీ ఎయిర్‌టెల్‌ ఎండీ, సీఈఓ(ఇండియా, దక్షిణాసియా) గోపాల్‌ విత్తల్‌ పేర్కొన్నారు. 'కంపెనీ బ్యాలెన్స్‌ షీట్‌ బలంగా ఉంది. నగదుకు ఇబ్బంది లేకపోవడం వల్ల ప్రభుత్వానికి స్పెక్ట్రమ్‌ బకాయిల్లో కొంత చెల్లించాం. తద్వారా వడ్డీ భారాన్ని తగ్గించుకున్నాం' అని వివరించారు.

అప్పులు రూ.1.59 లక్షల కోట్లు : 2021 డిసెంబరు ఆఖరుకు కంపెనీ నికర రుణాలు రూ.1.59 లక్షల కోట్లకు చేరాయి. 2020 ఇదే సమయానికి రుణాలు రూ.1.47 లక్షల కోట్లుగా ఉన్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌ ఇండియా ఆదాయాలు రూ.19,007 కోట్ల నుంచి 10శాతం వృద్ధితో రూ.20,913 కోట్లకు చేరాయి. భారత మొబైల్‌ సేవల ఆదాయం రూ.14,779 కోట్ల నుంచి 9శాతం వృద్ధితో రూ.16,091.7 కోట్లకు చేరింది. మొత్తం మొబైల్‌ ఆదాయాలు 19.1 శాతం మేర పెరిగాయి. 16 దేశాల్లో కంపెనీ మొత్తం వినియోగదార్ల సంఖ్య 48.5 కోట్లకు చేరింది. ఇందులో భారత వినియోగదార్లే 35.5 కోట్లుగా ఉన్నారు.

సగటు డేటా వినియోగం 18.28 జీబీ: 4జీ వినియోగదార్ల సంఖ్య భారత్‌లో 16.56 కోట్ల నుంచి 18.1 శాతం వృద్ధితో 19.5 కోట్లకు చేరుకుంది. ఒక్కో వినియోగదారు సగటు డేటా వినియోగం 16.37 జీబీ నుంచి 11.7శాతం పెరిగి 18.28 జీబీకి చేరింది. కంపెనీ మూలధన వ్యయాలు రూ.6863.8 కోట్ల నుంచి రూ.6101.5 కోట్లకు తగ్గాయి.

రుణ పథకాల ద్వారా రూ.7,500 కోట్ల వరకు నిధుల సమీకరణకు భారతీ ఎయిర్‌టెల్‌ బోర్డు అంగీకారం తెలిపింది. సెక్యూరిటీల జారీ నిర్ణయాలు తీసుకోవడానికి 'స్పెషల్‌ కమిటీ ఆఫ్‌ డైరెక్టర్స్‌'కు బోర్డు అధికారాలిచ్చింది. కంపెనీలో 1.28 శాతం వాటా కొనుగోలుతో పాటు ఇతరత్రా ఒప్పందాల నిమిత్తం గూగుల్‌ 100 కోట్ల డాలర్ల(దాదాపు రూ.7,500 కోట్లు) పెట్టుబడులు పెట్టనుందని గత నెలలో ఎయిర్‌టెల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇదీ చూడండి: ఆసియా కుబేరుడు అదానీ- రెండో స్థానానికి ముకేశ్‌ అంబానీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.