ETV Bharat / business

Covaxin: కెనడాకు 'కొవాగ్జిన్‌' టీకా.. ఆక్యుజెన్​తో డీల్​ - కెనడాలో కొవాగ్జిన్

అమెరికాకు చెందిన ఆక్యుజెన్​ ఇంక్​ సంస్థతో భారత్​ బయోటెక్​ ఒప్పందం కుదుర్చుకుంది. కొవాగ్జిన్(Covaxin)​ టీకా పంపిణీ కెనడాలో కూడా చేపట్టాలని సంస్థలు నిర్ణయించుకున్నాయి. కొవాగ్జిన్‌ టీకాకు ఇప్పటి వరకు 13 దేశాల్లో అత్యవసర అనుమతి లభించింది. మరో 60 దేశాల్లో అనుమతులు తీసుకునే ప్రక్రియను భారత్‌ బయోటెక్‌ చేపట్టింది.

covaxin in canada, కెనడాలో కొవాగ్జిన్
కెనడాకు 'కొవాగ్జిన్‌' టీకా
author img

By

Published : Jun 4, 2021, 6:49 AM IST

Updated : Jun 4, 2021, 7:44 AM IST

కెనడా విపణికి 'కొవాగ్జిన్‌'(Covaxin) టీకా అందించడానికి అమెరికాకు చెందిన ఆక్యుజెన్‌ ఇంక్‌. తో భారత్‌ బయోటెక్‌ అంతర్జాతీయ ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా విపణికి సంబంధించి ఇటువంటి ఒప్పందం ఇప్పటికే ఈ రెండు సంస్థల మధ్య ఉంది. ఇప్పుడు కెనడాకు సైతం విస్తరించాలని నిర్ణయించారు. తాజా అవగాహన ప్రకారం కెనడాలో 'కొవాగ్జిన్‌'(Covaxin) టీకాకు అనుమతులు తీసుకుని, విక్రయించే బాధ్యతను ఆక్యుజెన్‌ ఇంక్‌. చేపడుతుంది. టీకా అమ్మకాలపై వచ్చే ఆదాయంలో 45 శాతం ఆక్యుజెన్‌కు లభిస్తుంది.

అమెరికాలో అత్యవసర అనుమతికి దరఖాస్తు

భారత్‌ బయోటెక్‌తో తమకు బలమైన భాగస్వామ్యం ఏర్పడిందని, అందుకే కెనడాలోనూ కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు ఆక్యుజెన్‌ ఇంక్‌. ఛైర్మన్‌ , సీఈఓ డాక్టర్‌ శంకర్‌ ముసునూరి వివరించారు. కొవాగ్జిన్‌కు(Covaxin) అమెరికాలో అత్యవసర అనుమతి కోసం దరఖాస్తు చేస్తున్నామని, అదే దరఖాస్తును కెనడాలోనూ దాఖలు చేస్తామని తెలిపారు. కొవాగ్జిన్‌ టీకా పలు రకాల కరోనా వైరస్‌ వేరియంట్లపై సమర్థంగా పనిచేస్తున్నట్లు నిర్ధారణ అవుతోందని, అందువల్ల ఈ టీకాను అమెరికా, కెనడా ప్రజలకు అందించాలనేది తమ లక్ష్యమని పేర్కొన్నారు.

భారత్‌లో మానవ ప్రయోగాల దశలో, ఆ తర్వాత టీకా తీసుకున్న వారిలో.. కొవాగ్జిన్‌ టీకా ఎంతో ప్రభావశీలత కనబరచినట్లు భారత్‌ బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల అన్నారు. తాము ఆవిష్కరించిన టీకాలు ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగపడాలనేది తమ ఉద్దేశమని ఆయన వివరించారు. ఈ టీకాను అమెరికాలో అందుబాటులోకి తెచ్చేందుకు ఇప్పటికే ఆక్యుజెన్‌ ఇంక్‌., తో కలిసి పనిచేస్తున్నామని, ఉమ్మడిగా కృషి చేసి కెనడా మార్కెట్‌కు సైతం అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

13 దేశాల్లో అనుమతులు: కొవాగ్జిన్‌ టీకాకు ఇప్పటి వరకు 13 దేశాల్లో అత్యవసర అనుమతి లభించింది. మరో 60 దేశాల్లో అనుమతులు తీసుకునే ప్రక్రియను భారత్‌ బయోటెక్‌ చేపట్టింది. ఇప్పటి వరకు 3 కోట్లు డోసుల టీకాను వివిధ దేశాలకు సరఫరా చేశామని, అత్యంత భద్రమైన టీకాగా దీనికి గుర్తింపు లభించినట్లు డాక్టర్‌ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు.

ఇదీ చదవండి : కరోనా రోగుల కోసం 'రిలయన్స్' మందు!

Last Updated : Jun 4, 2021, 7:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.