ETV Bharat / business

'ముక్కు ద్వారా కరోనా టీకా'పై ట్రయల్స్! - భారత్ బయోటెక్ ముక్కు ద్వారా టీకా

ముక్కు ద్వారా ఇచ్చే కరోనా టీకా ట్రయల్స్​ను భారత్ బయోటెక్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో మొదటి దశ క్లినికల్ పరీక్షలు మొదలు పెట్టినట్లు సమాచారం. ఈ పరీక్షల నిర్వహణ కోసం భారత్‌ బయోటెక్‌కు ఇటీవలే డీసీజీఐ అనుమతి ఇచ్చింది.

BHARAT BIOTECH
'ముక్కు ద్వారా కరోనా టీకా'పై ట్రయల్స్!
author img

By

Published : Mar 9, 2021, 5:43 AM IST

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఇప్పటికే 'కొవాగ్జిన్‌' టీకాను తయారు చేసిన భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌, ఇక తన దృష్టిని ముక్కు ద్వారా ఇచ్చే కొవిడ్‌-19 టీకా ఆవిష్కరణపై కేంద్రీకరించింది. దీనిపై నాలుగు ప్రధాన నగరాల్లో మొదటి దశ క్లినికల్‌ పరీక్షలు ప్రారంభించింది. హైదరాబాద్‌తో పాటు చెన్నై, నాగ్‌పుర్‌, పట్నా నగరాల్లో ఈ క్లినికల్‌ పరీక్షలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా దాదాపు 150 నుంచి 200 మంది వలంటీర్లకు ముక్కు ద్వారా టీకా (బీబీవీ154- అడెనోవైరస్‌ వెక్టార్డ్‌ ఇంట్రానాసల్‌ వ్యాక్సిన్‌) ఇచ్చి ఫలితాలను విశ్లేషిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పరీక్షల నిర్వహణకు భారత్‌ బయోటెక్‌కు ఇటీవల డీసీజీఐ (డ్రగ్స్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా) అనుమతి ఇచ్చింది.

ముక్కు ద్వారా ఇచ్చే టీకా తయారీ కోసం గత ఏడాది సెప్టెంబరులో భారత్‌ బయోటెక్‌, యూఎస్‌లోని వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ఇన్‌ సెయింట్‌ లూయీస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కొవిడ్‌-19 వ్యాధికి ఛింప్‌ అడినోవైరస్‌తో సింగిల్‌ డోస్‌ ఇంట్రానాసల్‌ వ్యాక్సిన్‌ తయారు చేయటం ఈ భాగస్వామ్య ఒప్పందం ప్రధానోద్దేశం. ఈ టీకా తయారయ్యాక దాన్ని, యూఎస్‌, జపాన్‌, ఐరోపా దేశాలను మినహాయించి మిగిలిన దేశాల్లో విక్రయించే హక్కులు భారత్‌ బయోటెక్‌కు ఉంటాయి.

ఎన్నో ప్రయోజనాలు

కొవిడ్‌-19 వ్యాధి ప్రధానంగా ముక్కు ద్వారా వ్యాపిస్తుంది. అందువల్ల ముక్కు ద్వారా ఇవ్వటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నట్లు భారత్‌ బయోటెక్‌ కథనం. టీకా సమర్థంగా పనిచేయటంతో పాటు, సూది గుచ్చటంలాంటివి ఉండవు. టీకా ఇవ్వటం ఎంతో సులువు. ముక్కులో ఒక చుక్క టీకా వేస్తే చాలు. అదీ ఒక డోస్‌ చాలు. పిల్లలు, పెద్దవాళ్లకు ఇది ఎంతో సౌకర్యవంతమైన విధానం. పెద్ద మొత్తంలో టీకా తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా సరఫరా చేయటానికి వీలుంటుంది. ఎలుకలు, కోతులకు ఈ టీకా ఇచ్చినప్పుడు మెరుగైన ఫలితాలు కనిపించాయని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. అందువల్ల దీనిపై మలిదశ పరీక్షలు చేపట్టారు.

ముక్కు ద్వారా ఇచ్చే కొవిడ్‌-19 టీకా మనదేశం వంటి అధిక జనాభా కల దేశాలకు ఎంతో అనువైనదని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల గతంలో పలు సందర్భాల్లో పేర్కొన్న విషయం ఈ సందర్భంగా గమనార్హం. టీకా ఇవ్వటం సులువు కావటం, పెద్దఎత్తున తయారు చేసే అవకాశం ఉండటం ఈ సానుకూలతకు ప్రధాన కారణాలు. ఇదే విషయాన్ని గతంలో వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లోని బయోలాజిక్‌ థెరప్యూటిక్స్‌ సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ డేవిడ్‌ టి. కరేల్‌ కూడా చెప్పారు. ముక్కు ద్వారా ఇచ్చే టీకా వల్ల ఈ మహమ్మారి ముప్పు నుంచి అధిక రక్షణ లభిస్తుంది, ఎందుకంటే ముక్కు నుంచే గొంతులోకి వైరస్‌ విస్తరిస్తుంది- అన్నారాయన. పైగా ముక్కు ద్వారా టీకా ఇవ్వటం సులువని పేర్కొన్నారు.

కొవాగ్జిన్‌కు మెక్సికో అనుమతి!

కొవాగ్జిన్‌ టీకాకు మెక్సికో ప్రభుత్వం అనుమతి ఇవ్వనుందని తెలిసింది. ఈ టీకాను కొనుగోలు చేసేందుకు మెక్సికో ఆసక్తిగా ఉన్న విషయం విదితమే. ఇందులో భాగంగా మెక్సికోకు చెందిన సాంకేతిక నిపుణుల బృందం కొవాగ్జిన్‌ టీకాను పరిశీలించి, దానిపై సానుకూలత వ్యక్తం చేసింది. అందువల్ల త్వరలో ఆ దేశంలో అనుమతి లభించి, టీకా సరఫరా చేసే అవకాశం వస్తుందని భావిస్తున్నారు.

భారత్‌ బయోటెక్‌కు 'అన్విసా' బృందం

భారత్‌ బయోటెక్‌ నుంచి 2 కోట్ల డోసుల కొవాగ్జిన్‌ టీకా కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న బ్రెజిల్‌, అందుకు అవసరమైన ఇతర చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా బ్రెజిల్‌ ఔషధ నియంత్రణ సంస్థ 'అన్విసా' ప్రతినిధులు ఇటీవల భారత్‌ బయోటెక్‌కు చెందిన టీకాల తయారీ యూనిట్‌ను సందర్శించినట్లు తెలిసింది. బ్రెజిల్‌ ప్రభుత్వంతో పాటు, ఆ దేశానికి చెందిన కొన్ని ప్రైవేటు కంపెనీలు సైతం కొవాగ్జిన్‌ టీకా కొనుగోలుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బ్రెజిల్‌కు మందులు, టీకాలు సరఫరా చేయాలంటే అందుకు ‘అన్విసా’ అనుమతి అవసరం. అందువల్ల ఆ ప్రతినిధులు భారత్‌ బయోటెక్‌ పరిశీలనకు వచ్చినట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.