ETV Bharat / business

అదనంగా 20కోట్ల కొవాగ్జిన్​ టీకాల ఉత్పత్తి - కొవాగ్జిన్​

తమ సబ్సిడరీ అయిన చిరాన్​ బెహ్​రింగ్​ కంపెనీతో కలిసి అదనంగా 20కోట్ల కొవాగ్జిన్​ టీకా డోసుల్ని ఉత్పత్తి చేయబోతున్నట్లు భారత్​ బయోటెక్​ వెల్లడించింది. ఈ ప్రక్రియ వేగంగా జరుగుతుందని పేర్కొంది.

Bharat Biotech
భారత్​ బయోటెక్
author img

By

Published : May 20, 2021, 10:13 PM IST

Updated : May 20, 2021, 10:41 PM IST

కొవాగ్జిన్​ టీకాల ఉత్పత్తిని పెంచుతున్నట్టు భారత్​ బయోటెక్​ ప్రకటించింది. గుజరాత్​ అంక్లేశ్వర్​లోని తమ సబ్సిడరీ కంపెనీ అయిన 'చిరాన్​ బెహ్​రింగ్​ వ్యాక్సిన్స్​'లో అదనంగా 20కోట్ల టీకాలను ఉత్పత్తి చేయనున్నట్టు వెల్లడించింది. ఈ ప్రక్రియ వేగంగా జరుగుతుందని స్పష్టం చేసింది.

ఇనాక్టివేటెడ్​ వెరో సెల్​ సాంకేతికత ఆధారంగా, ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్ జీఎంపీ కేంద్రాల్లో వార్షికంగా.. అదనంగా 20కోట్ల టీకాలను ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు పేర్కొంది భారత్​ బయోటెక్​. 2021 క్యూ4 నుంచి ఈ ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేసింది.

ప్రపంచంలో.. అత్యంత నాణ్యమైన రేబీస్​ టీకాలను ఉత్పత్తి చేస్తున్న సంస్థల్లో చిరాన్​ బెహ్​రింగ్​ ఒకటి. ఐరాస సంస్థలకు టీకాలను అందిస్తోంది. 20కిపైగా దేశాల్లో ఈ సంస్థ ఉత్పత్తులకు రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. ఈ సంస్థను సొంతం చేసుకోవడం వల్ల రెబీస్​ టీకాల ఉత్పత్తిలో భారత్​ బయోటెక్​ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది.

Last Updated : May 20, 2021, 10:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.