జులై-సెప్టెంబర్లో.. తమ సంస్థ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి లభిస్తుందని భారత్ బయోటెక్ ఆశాభావం వ్యక్తం చేసింది. అమెరికా, బ్రెజిల్ సహా 60 దేశాల్లో కొవాగ్జిన్ టీకా అనుమతికి సన్నాహాలు జరుగుతున్నట్లు పేర్కొంది.
'కొవాగ్జిన్ అత్యవసర వినియోగ అనుమతికి డబ్ల్యూహెచ్ఓకు దరఖాస్తు చేశాం. జులై-సెప్టెంబర్ 2021లో అనుమతి లభించే అవకాశముంది.' అని భారత్ బయోటెక్ పేర్కొంది. ఇప్పటికే 13 దేశాల్లో భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన టీకాకు అనుమతి లభించింది.