ETV Bharat / business

మీ పత్రాలను భద్రంగా పెట్టుకోండిలా..

అప్పులు, పెట్టుబడులు, బీమా.. ఇలాంటి వాటన్నింటికి సంబంధించిన పత్రాలు చాలా ముఖ్యమైనవి. వ్యక్తిగత, కుటుంబ ఆర్థిక అంశాలకు సంబంధించి.. వీటితో చాలా అవసరం ఉంటుంది. అందువల్ల వాటన్నింటిని వీలైనంత భద్రంగా దాచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి సర్టిఫికెట్లను ఎలా సురక్షితంగా ఉంచుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

author img

By

Published : Jan 8, 2021, 10:55 AM IST

Updated : Jan 9, 2021, 11:18 AM IST

How to keep Safe your financial documents
ఆర్థిక డాక్యుమెంట్లను భద్రపరచడం ఎలా

పెట్టుబడులు, ఆస్తులకు సంబంధించిన పత్రాలను మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం. పెట్టుబడులన్నీ డిజిటల్‌ రూపంలోకి మారిన నేపథ్యంలో వాటి వివరాలు ఈ-మెయిల్‌ లేదా మొబైల్‌ సంక్షిప్త సందేశాల రూపంలోనే ఉంటున్నాయి. కొన్నిసార్లు వాటిని పొరపాటున తీసేస్తే.. మళ్లీ వాటిని పొందేందుకు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాలు ఎదురుకాకుండా.. పత్రాలను మనం ఎలా భద్రపర్చుకోవాలో చూద్దాం..

బ్యాంకు ఖాతాలు:

బ్యాంకు పొదుపు ఖాతాలు, తీసుకున్న రుణాలకు సంబంధించిన వివరాలన్నీ కావాల్సినప్పుడు చూసుకునే వీలుండాలి. ముఖ్యంగా గృహరుణ వివరాలు, ఇతర అప్పుల పత్రాలు ఒకేచోట ఉండేలా చూసుకోవాలి. తీర్చిన అప్పుల తాలూకు ఎన్‌ఓసీలు లేదా నో డ్యూ సర్టిఫికెట్లను కనీసం 5-8 ఏళ్లపాటు జాగ్రత్త చేసుకోవాలి. గృహరుణం పూర్తిగా తీర్చేసిన తర్వాత.. మన ఆస్తుల మీద ఉన్న తనఖాను రద్దు చేసుకోవాలి. ఆ పత్రాన్నీ దాచిపెట్టాలి. మీరు ఇంటి మరమ్మతు కోసం తీసుకునే రుణాల వివరాల పత్రాలనూ తీసి పెట్టుకోండి. మీరు ఇల్లు అమ్మినప్పుడు మూలధన లాభం లెక్కించే సందర్భాల్లో ఇవి ఎంతో ఉపయోగపడతాయి. పొదుపు ఖాతాల వివరాలు, చెక్కులు అన్నీ ఒకేచోట ఉన్నాయా ఒకసారి తనిఖీ చేయండి. నెలనెలా వచ్చే బ్యాంకు స్టేట్‌మెంట్‌ను కనీసం మూడేళ్ల వరకూ అట్టిపెట్టుకోండి.

బీమా:

ఇప్పుడు బీమా పాలసీలను చాలామంది ఆన్‌లైన్‌లో తీసుకుంటున్నారు. దీంతో వారి ఈ-మెయిళ్లలోనే పత్రాలు ఉంటున్నాయి. జీవిత, ఆరోగ్య, వాహన బీమా ఆన్‌లైన్‌లో తీసుకున్నా వాటి ప్రింటులను తీసుకొని, మనం జాగ్రత్త చేసుకోవాలి. ముఖ్యంగా జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు. జీవిత బీమాకు నామినీగా ఉన్నవారికి పాలసీ పత్రాలు ఎక్కడ ఉన్నాయన్న సంగతి స్పష్టంగా తెలిసి ఉండాలి. ఆరోగ్య బీమా పాలసీ కార్డులు ఉంటే.. అవి కుటుంబ సభ్యులందరికీ అందుబాటులో ఉండేలా చూసుకోండి. వాహన బీమా పత్రాల నకళ్లను ఇంట్లో.. కారులోనూ ఉంచుకోండి.

షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లు: షేర్లలో, ఫండ్లలో మదుపు చేసినప్పుడు వాటికి సంబంధించి నెలనెలా మనకు వివరాలు వస్తుంటాయి. వీటిని ఏడాదికోసారైనా ప్రింట్‌ తీసి, జాగ్రత్త చేస్తుండాలి. కంప్యూటర్‌ ఏజ్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ (క్యామ్స్‌) వెబ్‌సైటులో నమోదు చేసుకొని, మ్యూచువల్‌ ఫండ్ల వివరాలు చూసుకోవచ్చు. ఆ వివరాలను మీ కుటుంబ సభ్యులకు తెలియజేయండి. ఎన్‌ఎస్‌డీఎల్‌ లేదా సీడీఎస్‌ఎల్‌ నుంచి వచ్చే ఖాతాల స్టేట్‌మెంట్లనూ అందుబాటులో పెట్టుకోండి.

రిటర్నులు:

మీ ఆదాయ ధ్రువీకరణగా యాజమాన్యం ఇచ్చే ఫారం-16, ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసినప్పుడు వచ్చే అక్నాలజ్‌మెంట్‌ను కనీసం ఏడేళ్ల వరకూ జాగ్రత్త చేసుకోవాలి. రుణాలు, క్రెడిట్‌ కార్డులు తీసుకోవాలని అనుకున్నప్పుడు ఇవే కీలకం.

డిజిటల్‌ రూపంలో..

ముఖ్యమైన పత్రాలను జాగ్రత్త చేసేందుకు డిజిటల్‌ మార్గాన్నీ ఎంచుకోవచ్చు. కంప్యూటర్లతోపాటు, పెన్‌డ్రైవ్‌లాంటి వాటిల్లో లేదా క్లౌడ్‌ సర్వీసుల్లోనూ వీటిని దాచుకోవచ్చు. ఈ-మెయిళ్లలోనే ఉన్నాయి అనుకొని, వీటిని చాలామంది పట్టించుకోరు. కానీ, ఇది సురక్షితం కాదు. తప్పనిసరిగా వాటిని డౌన్‌లోడ్‌ చేసుకొని, విడిగా ఉంచుకోవాలి. ముఖ్యమైన పత్రాలకు పాస్‌వర్డ్‌ రక్షణ ఉండేలా చూసుకోవాలి.

ఇదీ చూడండి:మార్కెట్‌ జోరులో.. జాగ్రత్త గురూ!

Last Updated : Jan 9, 2021, 11:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.