ETV Bharat / business

ల్యాప్​టాప్​ కొనాలా? టాప్​-6 మోడల్స్​ ఇవే...

author img

By

Published : Jun 14, 2020, 4:15 PM IST

ప్రస్తుతం ప్రతి ఇంట్లో పర్సనల్ కంప్యూటర్ అనేది సర్వ సాధారణం అయిపోయింది. కరోనా వేళ ఆన్​లైన్ క్లాసులు, వర్క్ ఫ్రమ్ హోం లాంటి వాటితో వీటికి డిమాండ్ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో చాలా మంది కొత్త ల్యాప్​టాప్ కొనేందుకు మొగ్గుచూపుతున్నారు. మీరు కూడా ల్యాప్​టాప్​ కొనాలని భావిస్తుంటే.. ఈ కథనం మీ కోసమే. మార్కెట్లో ప్రస్తుతమున్న ఉత్తమ ల్యాప్​టాప్​లు, వాటి ఫీచర్లు, ధరల వంటి వివరాలు మీ కోసం.

best laptop to buy
బడ్జెట్​లో ఉన్న బెస్ట్ ల్యాప్​టాప్

దేశీయ మార్కెట్​లో ఒకప్పుడు మొబైల్ ఫోన్లకే పరిమితమైన పోటీ ఇప్పుడు ల్యాప్​టాప్​ల విషయంలోనూ మొదలైంది. పర్సనల్, గేమింగ్ ల్యాప్​టాప్​లకు డిమాండ్ ఎక్కువగా కనిపిస్తోంది. ఇదే అదనుగా కొత్త కొత్త మోడళ్లను విడుదల చేస్తూ.. ప్రత్యర్థి సంస్థలకు పోటీ ఇస్తున్నాయి ల్యాప్​టాప్​ తయారీ కంపెనీలు. అలా ఇటీవల విడుదలైైన ప్రముఖ కంపెనీల ల్యాప్​టాప్​ల వివరాలు ఇప్పుడు చూద్దాం.

హెచ్‌పీ...

ఇటీవల హెచ్​పీ బడ్జెట్ సెగ్మెంట్​లో 14ఎస్, పెవీలియన్ ఎక్స్ 360, 14ఎస్ పేరుతో రెండు మోడళ్లను విడుదల చేసింది.

hp
హెచ్​పీ ల్యాప్​టాప్

ఈ రెండు మోడళ్ల ఫీచర్లు..

  • 14 అంగుళాల డిస్​ప్లే
  • 4జీ సిమ్ వేసుకునే వెసులుబాటు
  • ఐ3, 10వ జనరేషన్+ 4 జీబీ ర్యామ్, ఐ5, 10వ జనరేషన్+ 8 జీమ్ ర్యామ్ వేరియంట్​లలో లభ్యం
  • 14ఎస్ ధర రూ.44,999
  • పెవీలియన్ ఎక్స్ 360 ధర రూ.64,999
  • పెవీలియన్ ఎక్స్ 360, 14ఎస్..​ ఐ5, 10వ జనరేషన్ ప్రాసెసర్, ఇంటెల్ ఐరిస్ ప్లస్ గ్రాఫిక్స్
  • 11 గంటల బ్యాటరీ బ్యాకప్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.

లెనోవో..

లెనోవో ఏకంగా నాలుగు ల్యాప్​టాప్​లను ఇటీవల విడుదల చేసింది.

lenovo
లెనోవో ల్యాప్​టాప్
  • ఐడియాపాడ్ స్లిమ్ 3, ఐడియాపాడ్ స్లిమ్ 5, ఐడియాపాడ్ గేమింగ్ 3, యోగా స్లిమ్ 7ఐ పేరుతో వీటిని తీసుకొచ్చింది.
  • ఈ మోడళ్లన్నీ ఇంటెల్, ఏఎండీ రైజెన్ ప్రాసెసర్లతో పని చేస్తాయి.
  • స్లిమ్ 3.. 14 అంగుళాలు, 15 అంగుళాల ఫుల్ హెచ్​డీ డిస్​ప్లేతో అందుబాటులో ఉంది.
  • ఎస్‌ఎస్, హెచ్‌డీడీలతో కూడిన హైబ్రిడ్ స్టోరేజ్ సదుపాయం స్లిమ్ 3లో ఉంది.
  • స్లిమ్ 5 లో 10వ జనరేషన్ ఐ7, ఏఎండీ రైజెన్ ప్రాసెసర్లు ఉన్నాయి
  • ఎన్‌విడియా జీఫోర్స్ ఎంఎక్స్ 330 గ్రాఫిక్స్ కార్డ్ ఉంది.
  • గేమింగ్ 3.. 15.6 అంగుళాల ఫుల్​ హెచ్​డీ డిస్​ప్లేతో అందుబాటులో ఉంది.
  • ఇందులో ఎన్‌విడియ జీటీఎక్స్ 1660 టీఐ గ్రాఫిక్స్ కార్డ్​ ఉంది.
  • యోగా స్లిమ్ 7ఐ 14 అంగుళాల డిస్​ప్లేతో అందుబాటులో ఉంది.
  • 4కే, డాల్బీ విజన్ సపోర్ట్​ ఫీచర్లు ఇందులో ఉన్నాయి ఉన్నాయి.
  • ఈ ల్యాప్​టాప్​ల ధరలు రూ. 26,990 నుంచి రూ.40,990 వరకు నిర్ణయించింది.

షియోమీ..

భారత స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో అగ్రస్థానాన్ని ఆక్రమించిన చైనా సంస్థ షియోమీ.. ఇటీవలే ల్యాప్​టాప్​ల వ్యాపారంలోకి అడుగుపెట్టింది. మార్కెట్​లోకి ప్రవేశిస్తూనే.. ఎంఐ నోట్ బుక్ 14, నోట్ బుక్ 14 హారిజన్ పేరిట రెండు మోడళ్లు విడుదల చేసింది.

mi
షియోమీ ల్యాప్​టాప్

రెండు మోడళ్ల ఫీచర్లు..

  • 14 అంగుళాల ఫుల్ హెచ్​డీ డిస్​ప్లే
  • 8 జీబీ ర్యామ్
  • నోట్ బుక్ 14 ఐ5 10 జనరేషన్​తో లభిస్తుంది.
  • 256 జీబీ ఎస్ఎస్‌డీ, 512 జీబీ ఎస్ఎస్‌డీ వేరియంట్లు ఉన్నాయి.
  • వీటి ధరలు రూ.41,999, రూ. 44,999గా నిర్ణయించింది షియోమీ.
  • 512 జీబీ వేరియంట్​లో ఎన్విడియా జీఫోర్స్ ఎంఎక్స్ 250 జీపీయూ అప్షన్ కూడా ఉంది. దీని ధర రూ. 47,999.
  • హారిజన్ నోట్ బుక్ 512జీబీ హైస్పీడ్ ఎస్ఎస్‌డీ పొందుపరిచింది.
  • ఐ5 10 జనరేషన్, ఐ7 10 జనరేషన్ ప్రాసెసర్ వేరియంట్లు ఉన్నాయి. హారిజన్ నోట్‌బుక్ ప్రారంభ ధర రూ. 54,999.

డెల్..

  • డెల్ లాటిట్యూడ్ 9510 పేరిట వ్యాపారుల కోసం ల్యాప్​టాప్ ను విడుదల చేసింది.
    dell+
    డెల్ ల్యాప్​టాప్
  • 15.6 అంగుళాల ఫుల్ హెచ్​డీ స్క్రీన్
  • 34 గంటల బ్యాటరీ సామర్థ్యం
  • ఇది టూ ఇన్ వన్ కన్వర్టబుల్ సదుపాయం.
  • ఇంటెల్ 10 జనరేషన్ జెన్ వీప్రో సీపీయూ
  • ప్రారంభ ధర రూ.1,49,000.
  • 5జీ మోడల్​ను ఆప్షనల్​గా తీసుకోవచ్చు
  • 16 జీబీ ర్యామ్ , 1టీబీ ఎస్ఎస్‌డీ

ఆసుస్​...

  • అసస్ టీయూఎఫ్ ఏ15, ఏ17 పేరిట గేమింగ్ ల్యాప్ టాప్‌లను విడుదల చేసింది.
    asus
    ఆసుస్​ ల్యాప్​టాప్
  • ఏ15.. 15.6 అంగుళాల ఫుల్ హెచ్​డీ డిస్​ప్లే
  • ఏ 17.. 17.3 అంగుళాల ఫుల్​ హెచ్​డీ డిస్​ప్లే.
  • 4 జనరేషన్ ఏఎండీ రైజన్ 4000 మొబైల్ ప్రాసెసర్
  • ఏఎండీ రైజిన్ 9 4900హెచ్ ప్రాసెసర్
  • ఎన్‌విడియా జీపోర్స్ జీటీఎక్స్ 1650, జీటీఎక్స్ 1650టీఐ, జీటీఎక్స్ 1660టీఐ వేరియంట్​ను ఎంచుకునే సదుపాయం.
  • జీటీఎక్స్ 2060 లిమిటెడ్ వేరియంట్ ఏ15 మోడల్​లో ఉంది
  • ఏ15 ప్రారంభ ధర రూ.60,990
  • ఏ17 ప్రారంభ ధర రూ.60,990

త్వరలోనే మరో రెండు ల్యాప్​టాప్​లు (ఆర్‌ఓజీ జీఏ15, జీఏ35) విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

ఏసర్..

ఏసర్ నైట్రో 5 పేరిట గేమింగ్ ల్యాప్​టాప్​ను విడుదల చేసింది.

acer
ఏసర్

ఫీచర్లు..

  • 15 అంగుళాలు, 17 అంగుళాల వేరియంట్​లలో అందుబాటులోకి
  • 10 జనరేషన్ ఇంటెల్ హెచ్ సిరీస్ ప్రాసెసర్
  • ఎన్ విడియా జీఫోర్స్ ఆర్టీఎక్స్ 2060 జీపీయూ వరకు ఎంచుకోవచ్చు
  • 32జీబీ వరకు ర్యామ్ పెంచుకునే సదుపాయం
  • ప్రారంభ ధర రూ. 72,990

ఇదీ చూడండి:వాట్సాప్​ నుంచి త్వరలో అద్భుతమైన ఫీచర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.