దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. లోహ, వాహన, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగాలు నష్టపోయాయి. 2020 బడ్జెట్‌కు ముందు మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తుండడం, భారత వృద్ధి తగ్గనుందన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనాలే ఇందుకు కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 205 పాయింట్లు కోల్పోయి 41 వేల 323 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 54 పాయింట్లు నష్టపోయి 12 వేల 169 వద్ద స్థిరపడింది.
లాభనష్టాల్లో
ఆల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఎయిర్టెల్, జీ ఎంటర్టైన్మెంట్, బీపీసీఎల్, భారతీ ఇన్ఫ్రాటెల్, కోల్ ఇండియా, కోటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ, ఓఎన్జీసీ, ఇండస్ఇండ్ బ్యాంకు రాణించాయి.
టాటా స్టీల్, ఎమ్ అండ్ ఎమ్, ఐఓసీ, ఏషియన్ పెయింట్స్, పవర్‌గ్రిడ్ కార్ప్, మారుతి సుజుకి నష్టపోయాయి.
ఆసియా మార్కెట్లు
చైనాను కరోనా వైరస్ పట్టిపీడిస్తున్న నేపథ్యంలో ఆసియా మార్కెట్లు షాంఘై, హాంగ్‌కాంగ్, టోక్యో, సియోల్ నష్టాల పాలయ్యాయి. ఐరోపా మార్కెట్లు కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి.
రూపాయి విలువ
రూపాయి విలువ 5 పైసలు క్షీణించి, ఒక డాలరుకు రూ.71.16గా ఉంది.
ముడిచమురు
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర 1.21 శాతం తగ్గింది. ప్రస్తుతం బ్యారెల్ ధర 64.41 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి: జూన్ 1 నాటికి పూర్తి స్థాయిలో 'వన్ నేషన్- వన్ రేషన్ కార్డ్'