ప్రముఖ బీర్ల కంపెనీలకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) భారీ జరిమానాలు విధించింది. యూనైటెడ్ బ్రూవరీస్ లిమిటెజ్(UBL), కార్ల్స్‌బర్గ్, ఆల్ ఇండియా బ్రూవర్స్ అసోసియేషన్ (AIBA)తో పాటు 11 మందికి రూ.873 కోట్ల జరిమానాలు విధించింది. 2009-2018 మధ్య బీర్ల తయారీ, సరఫరా, అమ్మకాల్లో ఈ కంపెనీలు పలు మోసాలకు పాల్పడ్డాయని పేర్కొంది. ఈ వ్యవహారంపై దాదాపు నాలుగేళ్లపాటు విచారణ అనంతరం వెలువరించిన తీర్పులో 231 పేజీల నివేదికను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సమర్పించింది.
యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్, మిల్లర్ ఇండియా లిమిటెడ్, అన్హ్యూసర్ బుష్ ఇన్‌బెవ్ ఇండియా లిమిటెడ్, కార్ల్స్‌బర్గ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (CIPL)తో పాటు ఇతర సంస్థలకు వ్యతిరేకంగా ఈ ఆర్డర్‌ను జారీ చేసింది. 'ఈ కంపెనీలన్నీ ఆల్ ఇండియా బ్రూవరీస్ అసోసియేషన్‌తో (AIBA) కలసి దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బీర్ అమ్మకం, సరఫరాలో అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించాం' అని సీసీఐ తెలిపింది.
యూబీఎల్కి రూ.752కోట్లు, కార్ల్స్‌బర్గ్ ఇండియాకు రూ.121కోట్లు ఏఐబీఏకి రూ.6.25 లక్షలు జరిమానా విధించింది సీసీఐ.
ఇవీ చదవండి: