కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ వల్ల చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు పరిమిత సిబ్బందితో పని చేస్తున్నాయి. అది కూడా తక్కువ సమయమే.
ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకులో పనులు ముందే ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా సెలవుల గురించి. రాష్ట్రాన్ని బట్టి బ్యాంకుల సెలవుల్లోనూ మార్పులు ఉంటాయి. ఇలా జూన్‌లో మొత్తం ఏడు రోజులు అదనపు సెలవులు ఉన్నాయి.
సెలవులు ఎప్పుడెప్పుడు?
జూన్ 15న గురు రాజా సంక్రాంతి (మిథున్ సంక్రాంతి) నేపథ్యంలో ఒడిశాలో బ్యాంకులకు సెలవు. యంగ్ మిజో అసోసియేషన్ (వైఎంఏ)డే సందర్భంగా మిజోరంలోను బ్యాంకులు పని చేయవు.
జూన్ 25న హర్ గోవింద్ జయంతి సందర్భంగా జమ్ముకశ్మీర్, శ్రీనగర్‌లో బ్యాంక్‌లకు సెలవు.
రెమ్నా నే సందర్భంగా జూన్ 30న మిజోరంలో బ్యాంకులు పని చేయవు.
వీటితో పాటు జూన్ నెలలో 6వ తేదీ(ఆదివారం), 12న (రెండో శనివారం), 13న (ఆదివారం), 20 (ఆదివారం) జూన్ 26న (నాల్గో శనివారం) జూన్ 27న (ఆదివారం) దేశవ్యాప్తంగా బ్యాంకులు సెలవులో ఉండనున్నాయి.