ETV Bharat / business

కరోనా చికిత్సకు ప్రభుత్వ బ్యాంకుల 'రుణం' - కెనరా బ్యాంక్​ కొవిడ్​ రుణం

కరోనా చికిత్స కోసం ప్రభుత్వ రంగ బ్యాంక్​లు రూ.5 లక్షల వరకు వ్యక్తిగత రుణాన్ని ఇవ్వనున్నాయి. ఈ మేరకు స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా, ఇండియన్​ బ్యాంక్స్​ అసోసియేషన్​ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి.

loan for covid treatment, canara bank loan for covid
కరోనా రుణం, బ్యాంకుల వ్యక్తిగత రుణం
author img

By

Published : May 31, 2021, 5:15 PM IST

కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వ రంగ​ బ్యాంక్​లు ముందుకొచ్చాయి. ఆసుపత్రుల్లో చికిత్సపొందుతూ.. బిల్లుల కట్టలేని వారికి ఎటువంటి పూచీకత్తు లేకుండా అన్నీ ప్రభుత్వం రంగ బ్యాంక్​లు రూ. 5 లక్షల వరకు రుణంగా ఇవ్వనున్నాయి.

కొవిడ్​ రెండో దశలో వినియోగదారులకు అండగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా, ఇండియన్​ బ్యాంక్స్​ అసోసియేషన్​(ఐబీఏ)లు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. కొవిడ్​ చికిత్సకు సంబంధించి రూ.25వేల నుంచి రూ.5లక్షల వరకు వ్యక్తిగత రుణం మంజూరు చేయనున్నట్లు తెలిపాయి. ఈ నిర్ణయం పెన్షనర్లు, శాలరీ, నాన్​-శాలరీ అకౌంట్​ ఉన్నవారికి కూడా వర్తిస్తుందని పేర్కొన్నాయి. ఈ రుణాలపై వడ్డీ సాధారణం కంటే తక్కువ ఉంటుందని వివరించాయి. వీటి కోసం బ్యాంక్​లు ప్రత్యేకించి కొవిడ్​ లోన్​ బుక్​ను ఏర్పాటు చేయాలని కోరాయి.

కెనరా సురక్ష వ్యక్తిగత రుణ పథకం..

కరోనాతో పోరాడుతున్న వారికి కెనరా బ్యాంక్​ ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. దాని పేరే కెనరా సురక్ష వ్యక్తిగత రుణ పథకం. దీని కింద కొవిడ్​ చికిత్సకు రూ.25వేల నుంచి రూ.5లక్షల వరకు రుణం అందించనున్నట్లు తెలిపింది. గత శుక్రవారం నుంచి సెప్టెంబర్​ చివరి వరకు ఈ పథకాన్ని వినియోగదారులకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. అయితే ఈ పథకం వర్తించాలంటే కరోనా బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడం కానీ, కోలుకున్న తరువాత కానీ సంబంధిత బిల్లులతో అప్లై చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ రుణాలకు ఎటువంటి ప్రాసెసింగ్​ ఫీజ్​ ఉండదని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: కీలక వడ్డీ రేట్లు మళ్లీ యథాతథమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.