ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. పది లక్షలకు మందికిపైగా బ్యాంకు ఉద్యోగులు, అధికారులు ఈ రెండు రోజుల సమ్మెలో పాల్గొంటుండగా ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బంగాల్, మహారాష్ట్రలోని యూనియన్ బ్యాంక్, ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా ప్రభుత్వ రంగ బ్యాంకులను మూసివేశారు.
యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు ఉద్యోగులు ఈ నిరసన చేపడుతున్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి : 'ఐరాస డిక్లరేషన్‌కు వ్యతిరేకంగా సాగు చట్టాలు'