ETV Bharat / business

Bank Of India : 2021-22 తొలి త్రైమాసికంలో రూ.720 కోట్ల నికర లాభం - boi announced its first quarters profits

2021-22 మొదటి త్రైమాసికంలో.. రూ.720 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా(Bank Of India) యాజమాన్యం ప్రకటించింది. గతేడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే.. కాస్త తగ్గినా.. నాలుగో త్రైమాసికంతో పోలిస్తే 188 శాతం వృద్ధి సాధించినట్లు వెల్లడించింది.

2021-22 తొలి త్రైమాసికంలో రూ.720 కోట్ల నికర లాభం

author img

By

Published : Aug 4, 2021, 1:35 PM IST

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(Bank Of India) 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.720 కోట్లు నికర లాభాన్ని ఆర్జించినట్లు ఆ బ్యాంకు యాజమాన్యం ప్రకటించింది. గతేడాది తొలి త్రైమాసికంలో వచ్చిన(రూ.844 కోట్లు) లాభంతో పోలిస్తే కాస్త తగ్గినా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంతో పోలిస్తే 188 శాతం వృద్ధి నమోదు చేసినట్లు వెల్లడించింది.

నికర వడ్డీ రూ.3145 కోట్లు..

నికర వడ్డీ రాబడులు మొదటి త్రైమాసికంలో రూ.3,145 కోట్లు రాగా అంతకు ముందు ఆర్థిక ఏడాది మొదటి త్రైమాసికంలో వచ్చిన రూ.3,481 కోట్లతో పోలిస్తే రాబడి స్వల్పంగా తగ్గిందని అధికారులు తెలిపారు. కానీ.. గతేడాది నాలుగో త్రైమాసికంలో వచ్చిన రూ.2,936 కోట్లతో పోలిస్తే 7శాతం పెరిగినట్లు వివరించారు.

వడ్డీయేతర రాబడులు రూ.2377 కోట్లు..

వడ్డీయేతర రాబడుల్లో ఈ ఆర్థిక ఏడాది మొదటి త్రైమాసికంలో రూ.2,377 కోట్లు రాగా.. ఇది అంతకు ముందు ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వచ్చిన రూ.1,707 కోట్లతో పోలిస్తే 39శాతం వృద్ధి నమోదు చేసినట్లు బ్యాంక్ యాజమాన్యం వెల్లడించింది. అదే గత ఆర్థిక ఏడాది నాలుగో త్రైమాసికంలో వచ్చిన రూ.2,053 కోట్లతో పోలిస్తే 16శాతం అధికంగా రాబడులు వచ్చాయని తెలిపింది. అంతర్జాతీయంగా 2.71శాతం వ్యాపారాభివృద్ధి జరిగి ఈ ఏడాది జూన్‌ చివరి నాటికి రూ.10.38లక్షల కోట్లకు చేరినట్లు బ్యాంకు పేర్కొంది.

దేశీయంగా రూ.3.65 లక్షల కోట్ల అప్పులు..

అదే విధంగా అంతర్జాతీయంగా రూ.4.14లక్షల కోట్లు అప్పులు ఉండగా, దేశీయంగా రూ.3.65లక్షల కోట్లు అప్పులు ఇచ్చి 1.65శాతం వృద్ధిని నమోదు చేసినట్లు బ్యాంకు యాజమాన్యం వివరించింది. అంతర్జాతీయంగా జూన్‌ చివర నాటికి 4.73శాతం వృద్ధి నమోదు చేసి రూ. 6.23లక్షల కోట్లకు ఎగబాకినట్లు తెలిపింది. దేశీయంగా 6.71శాతం వృద్ధి నమోదు చేసి రూ.5.52లక్షల కోట్లకు డిపాజిట్లు చేరినట్లు చెప్పింది. దేశీయంగా 13.80శాతం కాసా వృద్ది నమోదు చేసి ఈ ఏడాది జూన్‌ చివర నాటికి 43.22శాతానికి చేరినట్లు పేర్కొంది. నిరర్ధక ఆస్తులకు సంబంధించి మొదటి త్రైమాసికంలో ఎలాంటి మార్పు లేదని బ్యాంక్ ఆఫ్‌ ఇండియా స్పష్టం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.