Bank Locker India RBI Rules: బ్యాంకు లాకర్లో చాలామంది బంగారం, విలువైన ధ్రువపత్రాలు, ఆభరణాలను దాచుకుంటూ ఉంటారు. అయితే బ్యాంకు లాకర్లకు సంబంధించి ఆర్బీఐ నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ రూల్స్ 2022, జనవరి 1న అమల్లోకి వచ్చాయి.
ఆర్బీఐ కొత్త రూల్స్ ఇవే..
- లాకర్‌ను కేటాయించే ముందు కస్టమర్ల నుంచి బ్యాంకులు 'టర్మ్ డిపాజిట్' తీసుకునేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) అనుమతినిచ్చింది. దీంట్లో మూడేళ్లపాటు అద్దెతోపాటు మిగతా ఛార్జీలు ఉన్నాయి.
- అయితే ఇప్పటికే లాకర్లను వినియోగిస్తున్న కస్టమర్లను, ఖాతాను సమగ్రంగా నిర్వహిస్తున్నవారిని టర్మ్ డిపాజిట్ చేయమని సంబంధిత బ్యాంకులు ఒత్తిడి తేవద్దని ఆర్బీఐ తెలిపింది.
- బ్యాంకు ఖాతాదారులు వరుసగా మూడేళ్లపాటు లాకర్ అద్దె కట్టకుంటే.. ఏ లాకర్నైనా బ్రేక్ చేసే అధికారాన్ని సంబంధిత బ్యాంకులకు ఇచ్చింది ఆర్బీఐ.
- బ్యాంకులు.. తమ వద్ద ఖాళీగా ఉన్న లాకర్ల జాబితాను బ్రాంచ్ పరంగా ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకోవాలి. అంతేకాక వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న లాకర్ వివరాలనూ ఆ జాబితాలో పొందుపరచాలి.
- లాకర్ల దరఖాస్తు కోసం ఖాతాదారులు సమర్పించిన పత్రాలను క్షుణ్నంగా పరిశీలించి.. లాకర్లు ఖాళీగా లేకపోతే.. కస్టమర్లకు వెయిట్‌లిస్ట్ నంబర్లు ఇవ్వాలి.
- తమ వల్ల బ్యాంకు లాకర్‌కు ఏదైనా ప్రమాదం జరిగినా, లాకర్లు ధ్వంసమైనా, నష్టం వాటిల్లినా.. సంబంధిత బ్యాంకులే బాధ్యత వహిస్తాయని వివరిస్తూ.. ఓ పాలనీని తీసుకురావాలని ఆర్బీఐ సూచించింది.
- అయితే భూకంపం, వరదలు, ఉరుములు మెరుపులు, పిడుగుపాటు, ఇతర ఏదైనా విపత్తు వాటిల్లి.. లాకర్లు ధ్వంసమైతే సంబంధిత బ్యాంకుల బాధ్యత కాదని.. ఆర్బీఐ తీసుకొచ్చిన మార్గదర్శకాల్లో ఉంది.
- ఏదైనా దోపిడీ, అగ్నిప్రమాదం, మోసం జరిగి, లాకర్‌లోని వస్తువులు పోతే.. లాకర్ అద్దెకు 100 రెట్ల పరిహారం ఇవ్వాలని ఆర్బీఐ నిబంధనల్లో ఉంది.
ప్రస్తుతం ప్రభుత్వ బ్యాంకుల లాకర్ల వార్షిక అద్దె రూ. 2వేలు ఉంది. మెట్రో నగరాలు, పట్టణాల్లో రూ. 4వేలు ఉంది. పెద్ద లాకర్లకు వార్షిక అద్దె రూ. 8వేలుగా ఉంది. ఈ వార్షిక అద్దెలో జీఎస్టీ కూడా కస్టమర్లు కట్టాల్సి ఉంటుంది.
ఇవీ చూడండి: ఆభరణాలు ఉన్న బ్యాంక్ లాకర్‌కు బీమా అవసరమా?