కరోనా ప్రభావం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న నేపథ్యంలో పారిశ్రామిక, వ్యవసాయంతో పాటు ఇతర రంగాలు గాడినపడుతున్నాయి. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటున్న క్రమంలో బ్యాంకుల నుంచి రుణాల మంజూరు, డిపాజిట్లు అక్టోబర్ 8తో ముగిసిన పక్షం రోజుల వ్యవధిలో గణనీయమైన వృద్ధి నమోదైంది.
ఈ మేరకు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 8 మధ్య బ్యాంకుల రుణాల మంజూరు 6.48 శాతం వృద్ధితో రూ.110.13 లక్షల కోట్లకు చేరినట్లు తాజాగా విడుదల చేసిన ఆర్బీఐ నివేదికలో వెల్లడైంది. ఇదే సమయంలో డిపాజిట్లు సైతం 10.16 శాతం పెరిగి.. రూ. 157.56 లక్షల కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది.
ఇవీ చదవండి: