పల్సర్ బైక్‌లకు మార్కెట్లో ఉన్న క్రేజ్‌ను రెట్టింపు చేసేందుకు సరికొత్త మోడల్‌ను విపణిలోకి విడుదల చేసింది బజాజ్. బైక్ ప్రియులకు దీపావళి కానుకగా.. హై ఎండ్ వెర్షన్ బజాజ్ పల్సర్ 250 సీసీ ఇంజిన్ లాంచ్ చేసింది. మార్కెట్లోకి తొలి పల్సర్ మోడల్ విడుదలై 20 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో కంపెనీ ఈ కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. సరికొత్త పల్సర్ బైక్‌ను రెండు వేరియంట్లలో(ఎన్ఎస్ 250 ఆర్ఎస్, 250ఎఫ్) అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి ధరలు వరుసగా.. రూ.1.38 లక్షలు, రూ.1.40 లక్షలుగా(ఎక్స్-షోరూమ్) నిర్ణయించింది.
భారీ మార్పులు.. కొత్త ఫీచర్లు..
250 సీసీ మోడల్లో బజాజ్ సమూల మార్పులు చేసినట్లు తెలిపింది. ముఖ్యంగా గత మోడళ్లతో పోలిస్తే.. డిజైన్, సీటింగ్ హైట్, హెడ్‌లైట్ వంటివి పూర్తి భిన్నంగా ఉన్నాయి. టైర్లు మాత్రం.. పల్సర్ ఎన్ఎస్, ఆర్ఎస్ మోడళ్లను పోలి ఉన్నాయి.
పల్సర్ 250 సీసీ బైక్ రెండు వేరియంట్లలో ట్విన్ డిస్క్ బ్రేక్, టెలిస్కోప్ ఫ్రంట్ ఫోర్క్, రియర్ మోనోషాక్, డిజిటల్ ఇన్స్ట్రూమెంట్ క్లస్టర్‌తో ఆధునీకరించారు. వీటితో పాటు.. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డ్యుయల్ ఛానెల్ ఏబీఎస్, రైడ్ మోడ్స్ వంటి అధునాతన ఫీచర్లను పొందుపరిచారు.
ఇదీ చూడండి: Bajaj Dominar 400: బజాజ్ నుంచి సూపర్ బైక్.. ఫీచర్స్ ఇలా...