ETV Bharat / business

గృహ రుణాలపై వడ్డీ రాయితీ పథకం కొనసాగింపు

దిగువ మధ్య తరగతి ప్రజలకు లబ్ధి చేకూర్చేలా గృహ రుణాలపై వడ్డీ రాయితీ పథకాన్ని కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఇందు కోసం రూ.70,000 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్​లో భాగంగా... రెండో రోజు ఆమె ఈ కీలక ఆర్థిక ఉపశమన చర్యను ప్రకటించారు.

Interest Subsidy Scheme on Home Loans
గృహ రుణాలపై వడ్డీ రాయితీ పథకం
author img

By

Published : May 14, 2020, 5:39 PM IST

Updated : May 14, 2020, 5:48 PM IST

దిగువ మధ్య తరగతి ప్రజలకు లబ్ధి చేకూర్చేలా గృహ రుణాలపై వడ్డీ రాయితీ పథకాన్ని కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఇందుకోసం రూ.70,000 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్​లో భాగంగా... రెండో రోజు ఆమె ఈ కీలక ఆర్థిక ఉపశమన చర్యను ప్రకటించారు.

గృహ రుణాలపై వడ్డీ రాయితీ పథకం

2017లో తెచ్చిన క్రెడిట్ లింక్ సబ్సిడీ స్కీమ్​ను 2021 మార్చి వరకు పొడిగిస్తామని నిర్మలా సీతారామన్​ స్పష్టం చేశారు. 2020 మార్చితో ముగియాల్సిన ఆ పథకంతో ఇప్పటికే 3.3 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరిందని ఆమె తెలిపారు. ఇప్పుడు పథకం గడువు పెంచిన కారణంగా నిర్ణయంతో మరో 2.5 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని ఆమె పేర్కొన్నారు.

ఈ పథకం వల్ల రూ.6 లక్షల నుంచి 18 లక్షలలోపు ఆదాయం ఉన్న మధ్య తరగతి ఆదాయ వర్గాలవారికి చౌక ఇళ్ల రుణాలపై వడ్డీ రాయితీ సౌలభ్యం కలగనుంది. మరోవైపు దీని వల్ల ఉపాధి కల్పన, ఉక్కు, సిమెంట్, నిర్మాణ రంగ వస్తువులు, రవాణా రంగాలు కూడా పుంజుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆర్థికమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: రెండు నెలలు రేషన్​​ ఫ్రీ.. అద్దె ఇళ్లు మరింత చౌకగా

Last Updated : May 14, 2020, 5:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.