Ashok Elluswamy Tesla: భారత సంతతికి చెందిన అశోక్ ఎల్లుస్వామి.. దిగ్గజ వాహన తయారీ సంస్థ టెస్లాలోని ఆటోపైలట్ టీమ్‌లో చేరారు. ఈ విషయాన్ని టెస్లా వ్యవస్థాపకుడు, సీఈఓ ఎలాన్ మస్క్ వెల్లడించారు.
టెస్లా ఆటోపైలట్ టీమ్ నియామకాల కోసం గత కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో అన్వేషిస్తున్నారు మస్క్. ప్రజల జీవితాలను ప్రభావితం చేసే సమస్యలను ప్రత్యక్షంగా పరిష్కరించడంపై ఆసక్తి ఉన్న ఏఐ(కృత్రిమ మేధ) ఇంజినీర్లు కావాలని పిలుపునిచ్చారు. సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, ఏఐలో పనిచేసిన వారు.. పేరు, ఈమెయిల్ ఎడ్రస్ వివరాలు పంపాల్సి ఉంటుంది.
Elon musk news: తాజాగా.. ఎల్లుస్వామిని నియమించుకున్నట్టు తెలిపారు మస్క్. "టెస్లా సంస్థ ఆటోపైలట్ టీమ్‌ను ప్రారంభిస్తోందని ట్వీట్ చేశాను. నా ట్వీట్‌తో ఉద్యోగం పొందిన తొలి వ్యక్తి అశోక్," అని మస్క్ వెల్లడించారు.
టెస్లాలో చేరే ముందు.. ఫోక్స్‌వ్యాగన్ ఎలక్ట్రానిక్ రీసర్చ్ ల్యాబ్, డబ్ల్యూఏబీసీఓ వెహికిల్ కంట్రోల్ సిస్టమ్‌లో పనిచేశారు అశోక్.
ఇదీ చూడండి:- Elon Musk: ఉద్యోగం వదిలేయాలనుకుంటున్నా.. ఏమంటారు?: మస్క్