ETV Bharat / business

11 అంకెల మొబైల్​​ నంబర్లపై ట్రాయ్​ క్లారిటీ

దేశంలో 11 డిజిట్స్​తో కూడిన మొబైల్​ నంబర్లు రానున్నాయన్న వార్తల్లో నిజం లేదని స్పష్టంచేసింది ట్రాయ్​. ప్రస్తుతం ఉన్న 10 అంకెల మొబైల్​​ నంబర్లే కొనసాగనున్నట్లు తెలిపింది.

As  per TRAI recommendation,country will continue with 10-digit numbering,we've categorically rejected shifting to 11-digit numbering plan:Telecom Regulatory Authority of India
'మొబైల్​​ నంబర్లు 11 కాదు 10 అంకెలే'
author img

By

Published : May 31, 2020, 3:44 PM IST

మొబైల్​ సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే దిశగా త్వరలో​ 11 డిజిట్స్​ మొబైల్​ నంబర్​ వస్తున్నాయని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలను ఖండించింది టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ-ట్రాయ్​. అలాంటి నిర్ణయం ఏమీ తీసుకోలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న 10 అంకెల నంబర్లే కొనసాగుతాయని తేల్చిచెప్పింది.

"ట్రాయ్​ చేసిన 11 డిజిట్స్​ మొబైల్​ నంబర్​ ప్రతిపాదన వల్ల భారీ సంఖ్యలో కొత్త నంబర్లు పుట్టకు వస్తాయి" అని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఇలా చేయటం వల్ల కమ్యూనికేషన్​ వ్యవస్థకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సాఫీగా సాగి టెలికాం రంగం అభివృద్ధి చెందుతుందని విశ్లేషించాయి. వీటిని తోసిపుచ్చింది ట్రాయ్.

దేశంలో మొబైల్ నంబర్లు వినియోగం పెరిగిన కారణంగా 2003లో ట్రాయ్​ అప్పుడు వాడుకలో ఉన్న 9 సిరిస్​తో పాటు 8,7,6తో మొదలయ్యే నంబర్​ను తీసుకువచ్చింది. ఫలితంగా భారీ సంఖ్యలో కొత్త నెంబర్లు పుట్టుకువచ్చాయి.

ఇదీ చూడండి:2019-20 ఐటీ రిటర్ను ఫారాలు విడుదల

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.