ETV Bharat / business

147 ఉద్యోగాల కోసం లక్షన్నర దరఖాస్తులు - ఫేస్​1 సెబీ పరీక్ష

భారత మార్కెట్​ నియంత్రణాధికార సంస్థ సెబీలో ఉద్యోగాల కోసం దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. 147 ఖాళీల కోసం ఏకంగా 1.4 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.

SEBI_Jobs
'సెబీ'లో ఉద్యోగాల కోసం భారీగా దరఖాస్తులు
author img

By

Published : Nov 19, 2020, 7:03 PM IST

మార్కెట్​ నియంత్రణాధికార సంస్థ సెబీలో సీనియర్​ ఆఫీసర్​ ఉద్యోగాల కోసం 1.4 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 147 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సెబీ మార్చిలో నోటిఫికేషన్​ విడుదల చేసింది.

అక్టోబర్​ 31న సంబంధిత నోటిఫికేషన్ గడువు ముగిసినందున 1.4 లక్షల దరఖాస్తులు మొత్తంగా వచ్చినట్లు సెబీ ప్రకటించింది. ఈ నియామకంలో ఎంపికైన వారికి గ్రేడ్​ ఏ ఉద్యోగం కల్పించనున్నట్లు పేర్కొంది.

ముందే ఖరారైన పరీక్ష తేదీ!

వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో నోటిఫికేషన్​కు సంబంధించిన పరీక్షను ఆన్​లైన్​ ద్వారా నిర్వహించునుంది సెబీ. జనవరి 17న మొదటి దశ, ఫిబ్రవరి 27న రెండో దశ పరీక్ష నిర్వహించున్నట్లు స్పష్టం చేసింది.

ఈ నోటిఫికేషన్​లో... 80 అసిస్టెంట్ మేనేజర్​ పోస్టులు, 34 పరిశోధన రంగానికి సంబంధించినవి, 22 ఐటీ ఉద్యోగాలని సంస్థ గతంలో వివరించింది.

ఇదీ చదవండి:వ్యాక్సిన్ ప్రకటనతో ఫైజర్ షేర్ల జోరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.