ETV Bharat / business

విమాన టికెట్‌ కొంటున్నారా?.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే! - coronacvirus latest news

కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) వ్యాప్తి నేపథ్యంలో, ఈనెల 14 వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నందున, దేశీయ-అంతర్జాతీయ మార్గాల్లో విమాన సర్వీసులన్నీ నిలిచిపోయాయి. ఏప్రిల్‌ 15 తర్వాత లాక్‌డౌన్‌ కొనసాగించే వీలుందనే వార్తలు వెలువడుతున్నాయి. ఈనెల 30 వరకు టికెట్ల బుకింగ్‌ తీసుకోకూడదని ఎయిరిండియా నిర్ణయించింది. ఇండిగో, స్పైస్‌జెట్‌ వంటి ప్రైవేటు సంస్థలు మాత్రం దేశీయ ప్రయాణానికి టికెట్లు ఆఫర్‌ చేస్తున్నాయిు. మరి లాక్‌డౌన్‌ పొడిగిస్తే పరిస్థితి ఏమవుతుంది.. చెల్లించిన నగదు వాపసు వస్తుందా.. ఆయా సంస్థల షరతులు ఎలా ఉన్నాయో చూద్దాం..

Are you buying a plane ticket?
విమాన టికెట్‌ కొంటున్నారా?.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే
author img

By

Published : Apr 11, 2020, 7:35 AM IST

దేశీయంగా విమాన సర్వీసులు మార్చి 25 నుంచి పూర్తిగా నిలిచిపోయాయి. ఏప్రిల్‌ 14 లాక్‌డౌన్‌ వరకు విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన నియంత్రణ సంస్థ డీజీసీఏ (డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌), తదుపరి ఆదేశాలు ఇచ్చాకే పునఃప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. అంటే లాక్‌డౌన్‌ పొడిగింపుపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని అనుసరించే, డీజీసీఏ ఆదేశాలుంటాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఏప్రిల్‌ 15 నుంచి బుకింగ్‌లను కొన్ని ప్రైవేటు సంస్థలు ప్రారంభించాయి. సామాజిక దూరం పాటించాల్సి ఉంది కాబట్టి విమానాల్లో 3 సీట్ల వరుస ఉంటే, మధ్యసీటును ఖాళీగా ఉంచుతామని చెబుతున్నాయి.

గరిష్ఠంగా ఏడాది లోపు ప్రయాణించాలి

మార్చి 25 నుంచి ఏప్రిల్‌ 14 లోపు ప్రయాణానికి ముందస్తుగా టికెట్‌ కొనుగోలు చేసుకున్న వారికి, లాక్‌డౌన్‌ కారణంగా విమానాలు రద్దయ్యాయి. మరి టికెట్‌ సొమ్ము మాటేంటి అంటే.. వాపసు కావాలంటే, నిబంధనలకు అనుగుణంగా రద్దు చేసుకుంటే, ఒక్కో టికెట్‌పై రూ.3,000 వరకు మినహాయించుకుని, మిగిలిన మొత్తాన్ని ఇస్తామని సంస్థలు పేర్కొంటున్నాయి. అలా కాకుండా ప్రయాణతేదీ మార్చుకుంటే ఆ నగదు సద్వినియోగం అవుతుంది. టికెట్‌ ఎవరి పేరిట బుక్‌ అయిందో, ఆ వ్యక్తి పీఎన్‌ఆర్‌లోనే ఆమొత్తం నగదును ‘క్రెడిట్‌షెల్‌’ పేరిట సంస్థలు నిల్వ ఉంచుతున్నాయి. ప్రయాణికుడి పేర క్రెడిట్‌షెల్‌ ఏర్పాటైన ఏడాది వరకు, అదే వ్యక్తి ప్రయాణానికి దీన్ని వాడుకోవచ్చు. కానీ ప్రయాణతేదీ మార్పు రుసుం (రీషెడ్యూల్‌ ఫీ) ఉండదు కానీ, టికెట్‌ ధరలో మార్పు ఉంటే, ఆ మొత్తం చెల్లించాల్సి వస్తుంది.

ప్రయాణికులు తప్పనిసరిగా పరిశీలించుకోవాలి

విమానయాన సంస్థలు లాక్‌డౌన్‌ కారణంగా విమానాన్ని రద్దు చేస్తే, నేరుగా ప్రయాణికుల పీఎన్‌ఆర్‌లోనే క్రెడిట్‌షెల్‌లో, టికెట్‌ మొత్తాన్ని వేస్తున్నాయి. ఆయా సంస్థల వెబ్‌సైట్‌లో ‘మై బుకింగ్‌’/ఎడిట్‌ బుకింగ్‌లో పీఎన్‌ఆర్‌ రిట్రీవ్‌లోకి వెళ్లి, పీఎన్‌ఆర్‌ స్టేటస్‌ను తప్పక పరిశీలించుకోవాలి. అందులో మనం చెల్లించిన మొత్తం ఉంటుంది. ఏజెంట్‌ ద్వారా బుక్‌ చేసుకుంటే, వారి సాయంతో అయినా పరిశీలించుకోవచ్చు.

* కరోనా వల్ల మే వరకు ప్రయాణతేదీ మార్చుకోవాలన్నా, వీలు కల్పిస్తున్నాయి. ఆరోజు నుంచి క్రెడిట్‌షెల్‌ అమల్లోకి వస్తుంది.

* ఏప్రిల్‌ 15 నుంచి విమాన ప్రయాణాలపై మాత్రం డీజీసీఏ ప్రకటన వచ్చాకే స్పష్టత వస్తుందని సంస్థల ప్రతినిధులు తెలిపారు.

విమాన టికెట్లకు సంబంధించి, ఆయా సంస్థలు ఏమంటున్నాయంటే..

ఎయిరిండియా: ఈ ఏడాది మార్చి 23- ఏప్రిల్‌ 30 మధ్య ప్రయాణానికి కొనుగోలు చేసిన టికెట్లకు, క్రెడిట్‌ షెల్‌ ఏడాది వరకు ఉంటుంది. విదేశీ ప్రయాణాల్లో 6 నెలల కాలావధి ఉంటే టికెట్లకు 2020 సెప్టెంబరు 30 వరకు, విదేశీ గమ్యాలు అయితే 2021 మార్చి 31 వరకు రుసుము లేకుండా ప్రయాణతేదీని మరో తేదీకి మార్చుకునే వీలు కల్పిస్తోంది.

ఇండిగో: క్రెడిట్‌షెల్‌లో నగదు ఏడాది వరకు ఉంటుంది. దేశీయ బుకింగ్‌లను ఏప్రిల్‌ 15 నుంచి ప్రారంభించినా, అంతర్జాతీయ సర్వీసులను ఏప్రిల్‌ 30 వరకు స్వీకరించడం లేదు. ఏప్రిల్‌ 30లోపు నిర్ణయించుకున్న ప్రయాణాన్ని రద్దు చేసుకున్నా, క్రెడిట్‌షెల్‌లోనే నగదు ఉంటుంది.

స్పైస్‌జెట్‌: మే 31 వరకు ఇప్పటికే బుక్‌ చేసుకున్న, కొత్తగా బుక్‌ చేసుకునే వారికి కూడా, సెప్టెంబరు 30 లోపు ఒకసారి మాత్రం ప్రయాణతేదీ మార్చుకునే వీలు ఉచితంగా కల్పిస్తోంది. టికెట్‌ ధరలో మార్పు ఉంటే ఆ మొత్తం చెల్లించాలి. మార్చి 25-ఏప్రిల్‌ 14 తేదీల్లో ప్రయాణాలు రద్దయిన వారు, 2021 ఫిబ్రవరి 28 వరకు క్రెడిట్‌షెల్‌ నగదు వాడుకోవచ్చు.

గోఎయిర్‌: ఏప్రిల్‌ 30 వరకు ప్రయాణానికి కొనుగోలు చేసిన టికెట్‌ మొత్తాలను క్రెడిట్‌షెల్‌లో ఉంచుతుంది. తదుపరి ప్రయాణానికి ఈ మొత్తం వాడుకోవచ్చు.

ఎయిరేషియా: కరోనా వైరస్‌ కారణంగా ప్రయాణం రద్దయితే, ఏడాది వరకు క్రెడిట్‌ షెల్‌లో నగదు ఉంచుతారు. తదుపరి ప్రయాణానికి వినియోగించుకోవాలి.

విస్తారా: 2020 ఏప్రిల్‌ 30లోపు ప్రయాణానికి 2020 మార్చి 31లోపే టికెట్‌ బుక్‌ చేసుకుని ఉంటే, 2020 డిసెంబరు 31 వరకు ప్రయాణతేదీ మార్చుకునే వీలు కల్పిస్తోంది.

ట్రూజెట్‌: మార్చి 25 నుంచి సర్వీసులన్నీ రద్దు చేస్తున్నామని, డీజీసీఏ తదుపరి ఉత్తర్వులు ఇచ్చాకే పునఃప్రారంభిస్తామని తెలిపింది. ఈ కాలంలో రద్దయిన ప్రయాణాలకు సంబంధించి నగదును ఆయా పీఎన్‌ఆర్‌ల క్రెడిట్‌షెల్‌కు జమచేస్తామని, 6 నెలల్లోపు వినియోగించుకోవాలని వివరించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.