ETV Bharat / business

యాపిల్​ కొత్త వాచ్​లో వస్తోన్న ఫీచర్లు ఎంటో తెలుసా?

author img

By

Published : Mar 12, 2020, 7:43 AM IST

లగ్జరీ గాడ్జెట్​ల తయారీ సంస్థ యాపిల్​ సరికొత్త వాచ్​ను తీసుకురానుంది. గతంలో వచ్చిన వాటితో పోలిస్తే ఇది భిన్నంగా ఉంటుంది. అధునాతమైన సాంకేతికతతో రూపొందించిన ఈ వాచ్​లో ఏకకాలంలోనే ఆరోగ్య పర్యవేక్షణ సదుపాయలన్నింటినీ చూసుకునే వీలుంది. మరి ఈ వాచ్​ ఎలా పనిచేస్తుంది? ఓ సారి చదివేయండి.

Apple Watch Series 6 may feature blood oxygen detection, better ECG
రక్తంలోని ఆక్సిజన్ స్థాయిని సూచించే సరికొత్త వాచ్

టెక్​ దిగ్గజం యాపిల్​ సరికొత్త ఫీచర్లతో రాబోయే సిరీస్​లో కొత్త వాచ్​ను మార్కెట్​లోకి తేనుంది. అధునాతన సాంకేతికతను జోడించి రూపొందించే ఈ వాచ్​.. మానవ ఆరోగ్య పర్యవేక్షణలో భాగం కానుంది. రక్తంలో ఆక్సిజన్​ స్థాయి, మెరుగైన ఈసీజీ వంటి ఫీచర్లతో వాచ్​-6ను అందించాలని యోచిస్తోంది యాపిల్​. గతంలో ఇలాంటి ఫీచర్లతో ఓ వాచ్​ అందుబాటులోకి వచ్చినా.. అంతగా ఉపయోగంలోకి రాలేదు.

ఇలా పనిచేస్తుంది..

ఈ వాచ్​లోని రీడింగ్​ ప్రకారం... రక్తంలో ఆక్సిజన్​ స్థాయి 95 నుంచి 100 శాతం ఉంటే వారిని ఆరోగ్యకరంగా ఉన్నట్లు భావిస్తారు. 80 శాతం కంటే తక్కువగా ఉంటే గుండె సమస్యలు తలెత్తినట్లు(కార్డియాక్​ అరెస్ట్​) అంచనావేస్తారు. రక్తంలో ఆక్సిజన్​ సంతృప్త స్థాయికి దిగువకు వస్తే.. వెంటనే ఒక నోటిఫికేషన్​ వస్తుంది. ఇది సక్రమంగా లేని హృదయ స్పందన రేటును ఎప్పటికప్పుడు గుర్తుచేస్తుంది.

గతంలో వచ్చిన యాపిల్​ వాచ్​-4, వాచ్​-5 సిరీస్​లు నిమిషానికి 100 - 120 హృదయ స్పందన రేట్లను సూచిస్తాయి. కొత్త వెర్షన్​లో వచ్చే ఈ వాచ్..​ ఆ పరిమితుల్ని పెంచుతూ ఈసీజీ వంటి అధునాతన ఫీచర్లతో పనిచేయనుంది.

ఇదీ చదవండి: అప్పుడు ఐఫోన్ వాడితే మీ ఖాతాకు రూ.1,800 జమ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.