అంతర్జాతీయ టెక్ దిగ్గజం యాపిల్ 'స్ప్రింగ్ లోడెడ్-2021' పేరిట ఓ ఈవెంట్ నిర్వహించింది. టెక్ ప్రియులు ఎంతగానో ఎదురుచూసే ఈ మెగా ఈవెంట్ అమెరికాలో మంగళవారం జరిగింది. ఇందులో పలు ఉత్పత్తులను ఆవిష్కరించింది యాపిల్. ఈ ఏడాది జరిగిన తొలి యాపిల్ ఈవెంట్ ఇదే కావడం గమనార్హం.
ఈ ఈవెంట్లో ఆవిష్కరించిన ఉత్పత్తుల్లో.. యాపిల్ టీవీ-4కే, సిరి రిమోట్, సరికొత్త ఐప్యాడ్, ఎం-1ఐ మ్యాక్ కంప్యూటర్, 'ఎయిర్ ట్యాగ్స్' వంటివి ప్రధానంగా ఉన్నాయి.
ఐఫోన్ 12 పర్పుల్
యాపిల్‌లో బెస్ట్ సెల్లర్‌గా నిలిచిన ఐఫోన్ 12 సిరీస్‌లో పర్పుల్ కలర్ వేరియంట్‌ను ఆవిష్కరించింది. ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీ పర్పుల్ కలర్ వేరియంట్ ఏప్రిల్ 23 నుంచి ప్రీ బుకింగ్‌కు అందుబాటులో ఉండనున్నాయి. ఏప్రిల్ 30 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
యాపిల్ ఎయిర్‌ట్యాగ్స్
ఎప్పటినుంచో వార్తల్లో ఉన్న యాపిల్ 'ఎయిర్ ట్యాగ్'లను ఎట్టకేలకు ఆవిష్కరించింది యాపిల్. ఫైండ్ మై అప్లికేషన్‌తో అనుసంధానమై ఇది పనిచేస్తుంది. ట్యాగ్‌కు కనెక్టై ఉన్న డివైజ్‌ని ట్రాక్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
ఒక ఎయిర్‌ట్యాగ్ ధర 29 డాలర్లుగా నిర్ణయించింది యాపిల్. ఏప్రిల్ 30 నుంచి అమెరికాలో కొనుగోళ్లకు అందుబాటులోకి రానున్నాయి ఎయిర్‌ట్యాగ్స్.
యాపిల్ టీవీ4కే, సిరి రిమోట్
బయోనిక్ పవర్‌తో పనిచేసే 4కే టీవీని ఆవిష్కరించింది యాపిల్. డాల్బీ విజన్‌తో పాటు.. హై ఫ్రేమ్ హెచ్‌డీఆర్ నాణ్యత దీని సొంతం. ఐఫోన్ 12 ప్రోలో తీసిన వీడియోలను.. ఈ టీవీ ద్వారా డాల్బీ విజన్‌లో చూడొచ్చని యాపిల్ పేర్కొంది.
ఐమ్యాక్..
ఎం-1 చిప్ ద్వారా పని చేసే సరికొత్త ఐమ్యాక్ డెస్క్టాప్ను పరిచయం చేసింది యాపిల్. 24-అంగుళాల 4.5 కే రెటినా డిస్ప్లేతో ఇది అందుబాటులోకి రానుంది. 1080పీ ఫేస్‌టైమ్(వీడియో కాలింగ్), హెచ్‌డీ కెమెరా, స్టూడియో క్వాలిటీ మైక్స్, సిక్స్ స్పీకర్ సౌండ్ సిస్టమ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. దీని ధర 1499 డాలర్లుగా నిర్ణయించింది యాపిల్.
గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, పింక్, పర్పుల్, బ్లూ, సిల్వర్ రంగులో ఇది లభించనుంది.
ఇవీ చదవండి: ఓఎస్15పై యాపిల్ త్వరలో ప్రకటన?
తొలి 18 జీబీ ర్యామ్ ఫోన్ రిలీజ్- ధరెంతంటే..