ETV Bharat / business

ఇకపై ఆ మెసేజ్​లను ఇతరులు చూడలేరు! - ఎండ్​ టు ఎండ్​ ఎన్​క్రిప్షన్​

ఆండ్రాయిడ్​ యూజర్లకు మరో ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. తమ..​ మెసేజెస్​ యాప్​ను పూర్తి సురక్షితంగా మార్చినట్లు ప్రకటించింది ఆండ్రాయిడ్​. మూడో వ్యక్తికి కనిపించకుండా.. ఎండ్​ టు ఎండ్​ ఎన్​క్రిప్షన్​ మోడ్​ను తీసుకొచ్చింది. వీటికి అదనంగా మరిన్ని ఫీచర్లను జోడించింది.

Android's Messages app
ఆండ్రాయిడ్​ యూజర్లకు మరో ఫీచర్
author img

By

Published : Jun 17, 2021, 12:14 PM IST

ఇటీవల ఆన్​లైన్ ప్రైవసీపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఆండ్రాయిడ్ యూజర్లకు మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్​ మెసేజ్ యాప్​ను ఎండ్​ టూ ఎండ్ ఎన్​క్రిప్టెడ్​గా అప్​డేట్​ చేసింది. దీనితో ఏ ఇద్దరి మధ్య జరిగిన సందేశాలను ఇతరులెవ్వరూ చదవలేరు. నిజానికి ఈ ఫీచర్​ను గత ఏడాది బీటా యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది ఆండ్రాయిడ్. తాజాగా దీనిని ఇతర యూజర్లు వినియోగించేలా అప్ డేట్ ఇచ్చింది.

''మెసేజ్​ ఎండ్​ టు ఎండ్​ ఎన్​క్రిప్షన్​తో మీరు సందేశాలు పంపించుకోవడం.. మరింత సురక్షితం. ఈ మెసేజ్​లోని కంటెంట్​.. పంపే మీకు, పంపాల్సినవారికి తప్ప ఎవరికీ కనిపించదని హామీ ఇస్తున్నాం.''

- ఆండ్రాయిడ్​ అధికారిక వెబ్​సైట్​లో ప్రకటన

ఇద్దరి మధ్య సందేశాలు మూడో పార్టీ గానీ, గూగుల్​ కానీ యాక్సెస్​ చేయలేదు. ఎన్​క్రిప్షన్​ మోడ్​ను యాక్టివ్​ చేసుకోవడం మాత్రం తప్పనిసరి. మొదటగా.. చాట్​ ఫీచర్స్​ను ఎనేబుల్​ చేసుకుంటేనే ఎండ్​ టు ఎండ్​ ఎన్​క్రిప్షన్​ పనిచేస్తుంది. సెండ్​ బటన్​ వద్ద లాక్​ ఐకాన్​ కనిపిస్తే ఆ మెసేజ్​ ఎన్​క్రిప్టెడ్​ అని అర్థం.

ఎనేబుల్ చేయడం ఎలా?

  • మొదటగా గూగుల్​ మెసేజెస్​ యాప్​ డౌన్​లోడ్​ చేసుకుని ఓపెన్​ చేయండి.
  • పైన కుడివైపు హామ్​బర్గర్​ మెనూను ట్యాప్​ చేయాలి.
  • అక్కడ సెట్టింగ్స్​లోకి వెళ్లాలి.
  • చాట్​ ఫీచర్స్​ను సెలక్ట్​ చేసి.. 'యస్​, ఐయామ్​ ఇన్'​ను ట్యాప్​ చేయాల్సి ఉంటుంది.
  • గూగుల్​ మెసేజెస్​కు అనుసంధానం చేసిన మీ ఫోన్​ నెంబర్​ను ఎంటర్​ చేయాలి.
  • ధ్రువీకరణ పూర్తయ్యాక.. మీరు ఆ చాట్​ ఫీచర్స్​ను ఉపయోగించుకోవచ్చు.

కొత్త ఫీచర్లు..

ప్రైవసీకి భద్రత కల్పించడమే కాకుండా.. వాట్సాప్​ తరహాలో మరిన్ని ఫీచర్లనూ అందుబాటులోకి తీసుకొచ్చింది. అవేంటంటే..

  • మొబైల్​ డేటా, వైఫైతోనూ మెసేజ్​లు పంపించుకోవచ్చు.
  • గ్రూపుల్లోనూ సంభాషణలు జరపవచ్చు.
  • వాట్సాప్​ తరహాలో.. అవతలి వ్యక్తి టైప్​ చేస్తున్నప్పుడు దానిని మీరు గమనించవచ్చు.
  • మీరు చేరవేయాల్సిన వారికి మెసేజ్ వెళ్లిందా, చదివారా అనేది తెలుసుకోవచ్చు.

ఇవీ చదవండి: స్క్రీన్​షాట్​ తీయడం ఇక మరింత ఈజీ!

గూగుల్ కొత్త ఆప్షన్​తో యాడ్స్​కు చెక్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.